న్యూస్ రౌండప్ టాప్ 20

1.మే 10 నుంచి రేషన్ షాపులు బంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 10వ తేదీన రేషన్ షాప్ ల బంద్ చేపట్టనున్నాయి ఈ మేరకు రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రావు వెల్లడించారు .

2.ఏపీలో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,065 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

3.రేపటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్

కరోనా రెండవ దశ నియంత్రణ చర్యలను తమిళనాడు ప్రభుత్వం వేగవంతం చేసింది దీనిలో భాగంగానే సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్  విధించింది.

4.యూపీ లో మే 15 వరకు లాక్ డౌన్ పొడగింపు

ఉత్తరప్రదేశ్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మే 15 వరకు లాక్ డౌన్ ను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

5.తెలంగాణ మంత్రికి కరోనా

తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వ్యాధి నిర్ధారణ అయింది.

6.కీసరగుట్ట ఆలయం మూసివేత

కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో కీసర గుట్ట ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు.

5.కరోనా పై సర్పంచ్ లకు అవగాహన

రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్పంచులు గ్రామీణ ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించేందుకు వాగ్రెస్ ఫౌండేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో  వెబినార్లను  నిర్వహించనుంది.

6.ఏపీకి 3.60 లక్షల వాక్సిన్ లు

ఏపీకి మరికొన్ని కొవీ షీల్డ్ టీకాలు వచ్చాయి.మహారాష్ట్ర పూణేలో ని శరీరం ఇన్స్టిట్యూట్ నుంచి 3.6 లక్షల వ్యాక్సిన్ లు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి.

7.కోలుకున్న పవన్ కళ్యాణ్

Advertisement

కరోనా బారిన పడిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోలుకున్నారు .ఆయనకు వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల క్రితం ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు నిర్వహించగా వచ్చినట్లు జనసేన పార్టీ ప్రకటించింది.

8.జగన్ పై అచ్చెన్న విమర్శలు

హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మారారని టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నై నాయుడు విమర్శించారు.

9.జగన్ కు టిడిపి ఎమ్మెల్యేలు లేఖ

ఏపీ సీఎం జగన్ కు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు.జర్నలిస్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని,  రెండేళ్లుగా అక్రిడేషన్ మంజూరు చేయలేదని , వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలపై జగన్ కక్ష సాధింపు సరికాదు అని, జర్నలిస్టులను గుర్తించాలని అనేక డిమాండ్లతో జగన్ కు ప్రసాద్ లేఖ రాశారు.

10.చిత్తూరులో ఏనుగుల భీభత్సం-వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లాలోని పుత్తూరు కళ్యాణపురం లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.మామిడి తోటను ధ్వంసం చేశాయి.అంతేకాదు తోటలో ఉన్న కాపలాదారుడు పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

11.ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా పెంపు

కరుణ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా పెంచామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ తెలిపారు.

12.తెలంగాణలో కరోనా

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5,186 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.రాష్ట్రవ్యాప్తంగా టిడిపి వ్యాక్సిన్ దీక్షలు

టిడిపి నేతలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ దీక్షలు చేశారు.రాష్ట్రంలో ప్రజలు అందరికీ వెంటనే వ్యాక్సిన్ సమకూర్చాలని కోరుతూ ఇళ్లు, కార్యాలయాల్లో ప్లకార్డ్స్  ప్రదర్శిస్తూ దీక్షలు నిర్వహించారు.

14.నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ ఫోన్

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు.పంజాబ్, కర్ణాటక ,బీహార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు.

15.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,01, 078 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

16.ఇంటింటికీ వ్యాక్సిన్ తోనే కరోనాకు చెక్

ఇంటింటికి వ్యాక్సిన్ వేయడం ద్వారా మాత్రమే corona ను కట్టడి చేయగలమని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ యూఎస్ విశాల్ రావు పేర్కొన్నారు.

17.పాకిస్తాన్ లో లాక్ డౌన్

రోజురోజుకు పెరుగుతున్న కరుణ కేసులను కట్టడి చేసేందుకు పాకిస్తాన్ దేశవ్యాప్త లాక్ డౌన్ విధించింది.పది రోజుల పాటు ఈ లాక్ డౌన్ అమలులో ఉండబోతోంది.

18.కంగనా రనౌత్ కు కరోనా

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు.

19.ట్రంప్ వాడిన ఔషదనికి భారత్ గ్రీన్ సిగ్నల్

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయంలో కరుణ బారిన పడడంతో ఒక యాంటీబాడీ కాక్ టైల్  ఔషధాన్ని వాడి వేగంగా కోలుకున్నారు తాజాగా ఇప్పుడు ఆ ఔషధం భారత్ లో అందుబాటులోకి రానుంది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 44,910 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,910.

Advertisement

తాజా వార్తలు