బీజేపీ తో లాభం లేదా ?  జనసేన రూటు మార్చుతుందా ? 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు బీజేపీకి తీవ్ర నిరాశ కలిగించినా, అంతకంటే ఎక్కువగా జనసేన ను తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి నెట్టినట్టుగానే కనిపిస్తోంది.

ఇక్కడ స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి భారీ బహిరంగ సభ నిర్వహించారు.

బిజెపి అభ్యర్థి రత్న గెలిపించాలని పిలుపు ఇచ్చారు.అలాగే వైసిపి ప్రభుత్వం పైన ఎన్నో విమర్శలు చేశారు.

అసలు బిజెపి అభ్యర్థి రత్న ప్రభ పేరు ఖరారు కాకముందే,  జనసేన తిరుపతి ఎన్నికల్లో పోటీ చేయాలని చూసింది.ఈ మేరకు పవన్ కళ్యాణ్ తిరుపతి లో పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు చేశారు.

వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.జనసేన అభ్యర్థిని ఖరారు చేద్దామనుకుంటున్న సమయంలోనే బిజెపి అనూహ్యంగా రత్నప్రభ పేరును తెరమీదకు తెచ్చిందిి.

Advertisement

దీనికి జనసేన మద్దతు ఇచ్చేలా రాజకీయ చక్రం తిప్పింది.బీజేపీతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా , పవన్ సైతం సర్దుకుపోయి మరి బిజెపి అభ్యర్థి గెలుపు అందించేందుకు ఎంతగానో కృషిచేసిన,  చివరకు డిపాజిట్ సైతం కోల్పోవడం జనసేన ను తీవ్ర నిరాశ కు గురి చేసింది.

బిజెపి అగ్రనేతలు సైతం ఎన్నికల ప్రచారానికి దిగిన , తాను ఎన్నికల ప్రచారం చేసిన ఇంతటి దారుణమైన పరాభవం ఎదురుకావడం జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారు.బీజేపీతో ఏపీలో కలిసి  వెళ్లినా, కలిగే ప్రయోజనం ఏమీ ఉండదనే విషయం ఆ పార్టీకి బాగా అర్థం అయిపోయింది.అందుకే పొత్తుల విషయంలో పునరాలోచన చేయాలని జనసేనలో గుసగుసలు మొదలయ్యాయి .టీడీపీతో కలిసి రాబోయే ఎన్నికలను ఎదుర్కొంటే ఒక రకమైన ఫలితం దక్కుతుందని, అసలు ఏమాత్రం సంబంధం లేని బిజెపిని నమ్ముకుంటే ఏపీలో కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని ఇప్పుడు జనసేన నాయకులు లోనూ వినిపిస్తోంది.బిజెపి జాతీయ స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది అనే విషయం ఐదు రాష్ట్రలలో జరిగిన ఎన్నికలను చూస్తే అర్థమైపోతుంది.

దీంతో బిజెపితో కలిసి వెళ్లినా  ఆ ప్రభావం జనసేన పైన పడుతుందని,  దీని వల్ల కలిగే ప్రయోజనం కంటే, పరాభవమే ఎక్కువగా ఉంటుందనిి, పైగా బిజెపి తప్పిదాలు అన్నిటికీ ఏపీలో జనసేన సమాధానం చెప్పుకోవాల్సిి  వస్తుందిిఅనే విషయాన్ని జన సైనికులు ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉండడంతో,  బీజేపీ జనసేన పొత్తు పై అప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి. రానున్న రోజుల్లో టిడిపి , జనసేన పొత్తు పెట్టుకున్నా  ఆశ్చర్యపోనవసరం లేదు.

అయితే టిడిపి మాత్రం బిజెపిి, జనసేన రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ,మూడు పార్టీలు కలిస్తేనే వైసీపీ ని ఏపీ లో అధికారానికి దూరం చేయవచ్చు అనే విషయాన్ని బాగా నమ్ముతోంది.మరికొద్ది రోజుల్లోనే దీనికి .

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు