తెలంగాణలో కోవిడ్ తీవ్ర స్థాయిలో విజ్రుంభిస్తోంది.కోవిడ్ విజృంభణతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
అయితే కరోనాతో క్షీణిo చడం కంటే కరోనా వచ్చిందనే భయాందోళనతోనే ఎక్కువగా కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయని, వైద్యాధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది.అయితే దేశ వ్యాప్తంగా కరోనాతో చాలా మంది మృతి చెందుతున్నారు.
చాలా రాష్ట్రాలలో ఇదే తరహా పరిస్థితి ఉంది.అయితే ఇక్కడ బీజేపీ నాయకులు ఇదే అదునుగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం కరోనా వ్యవహారాన్ని మొత్తం వైద్య శాఖా మంత్రిగా మంత్రి ఈటెల రాజేందర్ పర్యవేక్షిస్తున్నాడు.
అయితే కరోనా కంటే ముందు వరకు కేసీఆర్ కు, ఈటెల రాజేందర్ కు మధ్య కొంత పరోక్ష వాదోపవాదాలు జరిగాయి.
అయితే ఆ తరువాత కరోనా రావడంతో అంతా సద్దుమణిగింది.అయితే బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించాలంటే మంత్రి ఈటెలను విమర్శిస్తే కేసీఆర్ కు ఆ సమాచారం చేరుతుంది.
బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించినా ఈటెల నుండి మాత్రం ఎలాగూ స్పందన రావడం లేదని బీజేపీ భావిస్తోంది.అందుకే బీజేపీ మంత్రి ఈటెల వైపు విమర్శనాస్త్రాలు సంధిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి బీజేపీ విమర్శలపై ఇప్పటివరకు టీఆర్ఎస్ స్పందించనప్పటికీ ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.