టాలీవుడ్ కి ఇంకో నెల రోజులు ఇవే కష్టాలట!

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎంత దారుణమైన స్థితిలో అందరికీ తెలిసిందే.ఈ వైరస్ ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉండగా.

ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్న క్రమంలో దేశం ఏమి చేయలేని పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

ఇప్పటికే పలు రంగాలు మూతపడగా.సినీ పరిశ్రమ కూడా మూత పడిన సంగతి తెలిసిందే.

ఇప్పటికీ పలు సినీ పరిశ్రమలో చాలామంది నటీనటులకు, దర్శకనిర్మాతలకు, సిని బృందాలకు వైరస్ వ్యాప్తి చెందగా.సినిమా షూటింగ్ లతో సహా.సినిమా విడుదల కూడా వాయిదా పడ్డాయి.అంతేకాకుండా థియేటర్లు కూడా మూతబడ్డాయి.

Advertisement

గత ఏడాదే ఫస్ట్ వేవ్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సినీరంగం.మళ్లీ అదే కోవలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

దాదాపు పదిహేను సినిమాలు విడుదలకు వాయిదా పడగా, షూటింగ్ సమయంలో ఉన్న దాదాపు 25 సినిమాలు వాయిదా పడ్డాయి.

ఇప్పటికే సినిమా షూటింగ్ లో చివరి దశలో ఉండగా సరైన సమయంలో సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అంతే కాకుండా పెద్ద పెద్ద సినిమాలకు భారీ బడ్జెట్ తో సెట్ లకు ఖర్చుపెట్టగా.కొంతవరకు అవి నష్టమే జరుగుంటాయి.

ఇక కొన్ని సినిమాలు పలు జాగ్రత్తలతో సినిమా షూటింగులు చేయాలనుకోగా.అందులో ఎవరో ఒకరు కీలక పాత్రస్తులు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భయంతో షూటింగ్ లో పాల్గొనడం లేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇక ఏమి చెయ్యలేక నటీనటులందరూ తమ ఇళ్లల్లో ఉండిపోయారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు.

Advertisement

ఇక ప్రతి సినీ బృందాలు సినిమాలకు బ్రేక్ ఇస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు.తిరిగి మళ్లీ కేసుల సంఖ్య అదుపులోకి వచ్చేంతవరకు షూటింగులు జరగకూడదని ఫిక్స్ అయ్యారు.

కాబట్టి మరో నెల మొత్తం సిని ఇండస్ట్రీ ఇలాగే ఉంటుందని తెలుపుతున్నారు.

తాజా వార్తలు