సిసింద్రీ సినిమాతో ఊహ తెలియని వయస్సులోనే తనలో మంచి నటుడు ఉన్నాడని అక్కినేని అఖిల్ ప్రూవ్ చేసుకున్నారు.సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత మహేష్ బాబు తరహాలో అఖిల్ సూపర్ స్టార్ అవుతాడని ఫ్యాన్స్ భావించారు.
అయితే ఫ్యాన్స్ అంచనాలకు భిన్నంగా అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించగా ఆ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ కావడం గమనార్హం.
అఖిల్ నటించిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాలకు కలెక్షన్లు ఎక్కువగా రాకపోవడంతో కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి.
అయితే అఖిల్ తొలి సినిమా “అఖిల్” ఫ్లాప్ కావడానికి అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది.ప్రముఖ రచయిత వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ అఖిల్ ఫ్లాప్ కావడానికి అసలు కారణాన్ని వెల్లడించారు.వెలిగొండ శ్రీనివాస్ “అఖిల్” మూవీ కథను చరణ్ కోసం తయారు చేశామని అఖిల్ కోసం కాదని చెప్పారు.
“అఖిల్” కథ సిద్ధమయ్యే నాటికి చరణ్ కు స్టార్ హీరోగా గుర్తింపుతో పాటు కమర్షియల్ సక్సెస్ లు ఉండటంతో వైవిధ్యంతో కూడిన కథను చరణ్ కొరకు సిద్ధం చేశామని చెప్పారు.అయితే అఖిల్ ఫస్ట్ మూవీని అదే కథతో తెరకెక్కించాల్సి రావడంతో కథలో మార్పులు చేశామని ఆ కారణం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందని వెలిగొండ శ్రీనివాస్ వెల్లడించారు.
“అఖిల్” మూవీ ఫ్లాప్ కావడంతో ఆ సినిమా ప్రభావం దర్శకుడు వీవీ వినాయక్ పై కూడా పడిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా రిజల్ట్ వల్ల వీవీ వినాయక్ కు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.ప్రస్తుతం వినాయక్ ఛత్రపతి మూవీ హిందీ రీమేక్ పనులతో బిజీగా ఉన్నారు.