నాగ చైతన్య 'థాంక్యూ' మూవీ లేటెస్ట్ అప్డేట్..!

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈ మధ్య విభిన్న కథలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.

మజిలీ సినిమా హిట్ అయిన తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ సినిమా స్టార్ట్ చేసాడు.

ఈయన సినిమాలంటే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే విధంగా ఉంటాయి కాబట్టి మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో నాచ్యురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్, టీజర్, పాటలు అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమా ఏప్రిల్ 16 న విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.

అయితే ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాను విక్రమ్ హర్రర్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.అయితే అవికా గోర్ నాగ చైతన్యకు చెల్లెలిగా నటించబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్లాన్ చేశారని తెలుస్తుంది.కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా షూటింగ్ చేయబోతున్నారని తెలుస్తుంది.ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య, రాశి ఖన్నా పై కీలక పార్ట్ షూటింగ్ చేయబోతున్నారని సమాచారం.

అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో నాగ చైతన్య మహేష్ బాబు కల్ట్ ఫ్యాన్ గా కనిపించి ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడని తెలుస్తుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు