పురపోరు యథాతధం..!

కరోనా వైరస్ ఉదృతంగా మారుతున్న ఇలాంటి టైం లో తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ వాయిదా వేస్తారన్న వార్తలు వస్తున్నాయి.

అయితే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కు ఎలాంటి ఇబ్బందులు లేవని యథాతధంగా ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం చెబుతుంది.

కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేస్తామని అంటున్నారు.ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి ఎస్.ఈ.సీ లేక రాయడం జరిగింది.ఈ నెల 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటుగా మరో ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

ఇక తెలంగాణా ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది.కరోనా ప్రభావం చూపిస్తున్నా సరే మున్సిపల్ ఎన్నికలకు ఈసీ రెడీ అవుతుంది.

కరోనా ప్రభలుతున్న ఇలాంటి టైం లో ఎలఖన్స్ వాయిదా వేయాలని కొంతమంది కోర్టుని ఆశ్రయించారు.హైకోర్ట్ ఎన్నికలను ఆపడం కుదరదని చెప్పడంతో డౌట్ క్లారిఫై అయ్యింది.రాష్ట్రంలో జరుగనున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎలక్షన్ల ప్రచార జోరు కొనసాగుతుంది.

Advertisement

 ముఖ్యంగా గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని టీ.ఆర్.ఎస్ చూస్తుంది.వరంగల్ 66 డివిజన్లు, ఖమ్మం 60 డివిజన్లకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి.

 ఇతర పార్టీలు కూడా టీ.ఆర్.ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు