కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా..?

ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన "చైనా" దేశం నుంచి సోకిన "కరోనా మహమ్మారి" ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని ఒక్కసారిగా కుదేలు చేస్తోంది.

ఈ కరోనా మహమ్మారి దెబ్బకి ప్రజల ఆరోగ్య సమస్యలతో పాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి.

దీంతో ఇప్పటికీ చిన్న చిన్న దేశాలు తమ ఆర్థిక వ్యవస్థని బలపరచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.అయితే ఈ కరోనా  వైరస్ మహమ్మారి ని నియంత్రించేందుకు ఇటీవలే పలు దేశ ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాయి.

దీంతో కరోనా పరంగా కొంతమేర ఉపశమనం లభించినప్పటికీ కొందరికి ఆరోగ్యపరమైన సమస్యలు గురించి కొత్తకొత్త  డౌట్లు ఉత్పన్నమవుతున్నాయి.అయితే ఇందులో ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా.? లేదా అనే అనుమానాలను కొంతమంది వ్యక్తపరుస్తున్నారు.దీంతో తాజాగా కొందరు వైద్య నిపుణులు ఈ విషయంపై స్పందిస్తూ కరోనా  వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు శృంగారంలో పాల్గొనే టప్పుడు కండోమ్లను ధరించాలని సూచిస్తున్నారు.

అయితే ఇందులో కరోనా వ్యాక్సిన్  మొదటి డోసు తీసుకున్న వారు మాత్రం రెండో డోసు తీసుకునేంతవరకు శృంగార జీవితానికి దూరంగా ఉంటే మంచిదని కూడా కొందరు సూచిస్తున్నారు.అంతేకాకుండా శృంగారంలో పాల్గొన్న తర్వాత మంచి విటమిన్లు ప్రోటీన్లు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

ఇక తాజాగా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతుడడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి.తాజాగా తెలంగాణ రాష్ట్రం కూడా ఈనెల 20వ తారీకు నుంచి మే ఒకటో తారీకు వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.

ఈ కర్ఫ్యూలో భాగంగా అత్యవసర పరిస్థితులలో తప్ప మరే ఇతర కారణాలతో ప్రజలను బయటికి రావద్దంటూ ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.అంతేకాకుండా మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు.

.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు