వైరల్ వీడియో... బట్లర్ కు కొత్త పేరు పెట్టిన సంజూ సామ్సన్

ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇక కోవిడ్ తో మానసికంగా నెగెటివ్ వాతావరణం ఉన్న పరిస్థితులలో ఐపీఎల్ ను ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా క్రికెట్ ను ఆస్వాదిస్తున్న పరిస్థితి ఉంది.

సహజంగానే భారత దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎంతటిదో మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదు.వయస్సుతో నిమిత్తం లేకుండా క్రికెట్ ను అన్ని రకాల వర్గాల ప్రజలు ఆస్వాదిస్తారు.

ఇక భారత క్రికెట్ లో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ మరే దేశంలో ఉన్న ఏ ప్రాంచైజీ ఆటకు లేదంటే ఐపీఎల్ ను ఎంతలా అభిమానిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక ఐపీఎల్ విషయానికొస్తే మ్యాచ్ సమయంలో విధ్వంసకర ఆట తీరుతో చెలరేగే మన స్టార్ క్రికెటర్ లు, మ్యాచ్ లు లేని సమయంలో రకరకాల కార్యక్రమాలతో అభిమానులను ఆనందపరుస్తారు.

అయితే టీంలో జరిగే ఫన్నీ వీడియోలను ఆయా ఫ్రాంచైజీలు తమ సోషల్ మీడియా పేజీలలో షేర్ చేస్తుంటాయి.తాజాగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ జోస్ బట్లర్ కు కొత్త పేరు పెట్టాడు.

Advertisement

డ్రెస్సింగ్ రూం లో టీం మీటింగ్స్ జరుగుతున్న సమయంలో జోస్ బట్లర్ ను జోస్ భాయ్ అని సంభోధించడంతో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు