బెంగాల్ లో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్..!!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశలలో జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే నాలుగు దశలు విజయవంతంగా ముగియగా 5 వ దశ పోలింగ్ ప్రారంభమైంది.

ఉదయాన్నే పోలింగ్ సెంటర్లకు వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఐదవ విడత ఎన్నికలలో 45 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.ఓటర్ల లిస్టు లో అవకతవకలు జరిగినట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఆరోపించగా, ఈ వ్యవహారంలో కలుగజేసుకుని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో అంత డిజిటలైజేషన్ లో ఉన్నట్లు వివాదం నెలకొన్న సమయానికి వివరణ ఇచ్చి వివాదం తలెత్తకుండా చేశారు.

ఇదిలా ఉంటే జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలలో చాలావరకు పోటాపోటీ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య నెలకొని ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.గత పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ భారీగా ఓటింగ్ శాతం రావడంతో జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కమలనాథులు.

Advertisement

ఇదే తరుణంలో మరోసారి అధికారం చేపట్టాలని మమతా బెనర్జీ కూడా తీవ్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ప్రస్తుతం ఐదో దశ ఎన్నికలు బెంగాల్ రాష్ట్రంలో చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు