#AskKTR లో భాగంగా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా   ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ముఖ్యంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యల పై స్పందించడంతో పాటు పలు రాజకీయ అంశాలపై తనదైన శైలిలో పోస్ట్ లు, కామెంట్స్ పెట్టడం మనం చూస్తూనే ఉంటాం.

అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయన ట్విట్టర్ ద్వారా కేటీఆర్ #AskKTR అని పేరుతోనే నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటాడు మంత్రి కేటీఆర్.ఐతే తాజాగా జరిగిన #AskKTR పేరుతో లైవ్ చాట్ నిర్వహించారు.

 ఇందులో భాగంగా నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్.ఇందులో ఎక్కువగా నెటిజన్స్ కేటీఆర్ వ్యక్తిగత  విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

మరికొందరు ఐతే వారి సమస్యలకు పరిష్కారాలు చూడాలని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం.అలాగే కొన్ని సరదా ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

Advertisement

ఇందులో ముఖ్యంగా కేటీఆర్ సార్ మీరు అచ్చం హీరో లాగా ఉన్నారు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో ఎప్పుడు ప్రయత్నించలేదా అంటూ ప్రశ్నించాడు ఓ నెటిజన్.దీనికి కేటీఆర్ టీనేజ్ లో ఉన్న ఫోటో ఒకటి జత చేశాడు.

ఇందుకు  కేటీఆర్  సమాధానం ఇస్తూ హాలీవుడ్, బాలీవుడ్ అని మరి పెద్ద చెట్టు ఎక్కించవద్దు అంటూ రిప్లై ఇచ్చాడు.ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు తెలిపాడు అవి ఏమిటో ఒకసారి చూద్దామా.

కేటీఆర్ సార్ మీ ఫేవరెట్ క్రికెటర్ ఏవరు ఎవరు అని ఒక నెటిజన్  అడగగా.అందుకు సమాధానంగా రాహుల్ ద్రావిడ్ అని, అలాగే  ప్రస్తుతం ఉన్న వారిలో విరాట్ కోహ్లీ అని చెప్పుకొచ్చాడు.

అలాగే రాష్ట్రంలో కరోనా వాక్సిన్  సప్లై ఏవిధంగా ఉంది అని అడగగా.కేటీఆర్ అందుకు సమాధానం ఇస్తూ నాకు తెలిసినంత వరకు దేశవ్యాప్తంగా కొరత ఉందని బదులిచ్చాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అలాగే ఈ క్రమంలో ఒక నెటిజన్ సిద్దిపేట గురించి చెప్పండి అని అడగక కేటీఆర్ అందుకు సమాధానం ఇస్తూ  తెలంగాణలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టౌన్ అని కేటీఆర్ తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు