సైనా సినిమాకి రిలీజ్ ఖర్చులు కూడా రాలేదంట

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో తెరపైకి బయోపిక్ కథలు వరుసగా వచ్చి పడ్డాయి.ఆరంభంలో ఈ బయోపిక్ స్టోరీస్ కి మంచి ఆదరణ లభించింది.

 Biopic On Saina Nehwal Takes A Disaster Opening, Bollywood, Parineeti Chopra, Bo-TeluguStop.com

దీంతో చాలా మంది నిజ జీవిత కథలపై దృష్టి పెట్టారు.క్రీడాకారుల సక్సెస్ స్టోరీస్ ని తీసుకొని దానిని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు.

అయితే క్రింది స్థాయి నుంచి వచ్చి ఉన్నతంగా ఎదిగిన వారి జీవితాలలో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు ఉంటాయి.అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆటనే శ్వాసగా బ్రతికేవారు సక్సెస్ అయినా వారి జీవితాలలో కష్టాలు పెద్దగా ఉండకపోవచ్చు.

అయితే సక్సెస్ స్టోరీస్ అన్ని కూడా సినిమాలకి ఉపయోగపడవని కొన్ని బయోపిక్ లు చూస్తేనే తెలుస్తుంది.మహానటి బయోపిక్ స్ఫూర్తితో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే అది ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే.

అలాగే బాలీవుడ్ లో కూడా అజారుద్దీన్ బయోపిక్ ఫ్లాప్ అయ్యింది.ఇప్పుడు ఆ కోవలోకే సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా చేరిపోయింది.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నిజ జీవిత కథతో పరిణీతి చోప్రా లీడ్ రోల్ లో సైనా సినిమా హిందీలో తెరకెక్కింది.భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ట్రైలర్ బాగుండటంతో సినిమా కథాంశం కూడా బాగుంటుందని అందరూ భావించారు.అయితే రిలీజ్ తర్వాత ఫలితం మరోలా వచ్చింది.

సైనా పాత్రకి పరిణీతి చోప్రా పూర్తి స్థాయిలో న్యాయం చేసినా కూడా కంటెంట్ లో బలమైన ఎమోషన్స్, థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.పాత్రలు ఎవరి పరిధి మేరకు వారు చేసిన సినిమా సక్సెస్ అవ్వాలంటే కేవలం అందరూ చూసిన అంశాలనే తెరపై చూపిస్తే సరిపోదని, అంతకు మించి సస్పెన్స్ అంశాలు, ఎమోషన్స్ ని ఆవిష్కరించాలనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి రెండో రోజు నుంచి థియేటర్స్ ఖాళీ అయిపోయాయి.దానికి తోడు కరోనా ప్రభావం ఉండటంతో సైనా సినిమా కనీసం థియేటర్స్ ఖర్చులు కూడా రాబట్ట లేకపోయిందని టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube