వైసీపీలో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆ నేత..!!

తెలంగాణ రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి నేడు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది.

వైయస్ జగన్ తనకి 2007వ సంవత్సరం నుండి తెలుసు అని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసిన జగన్.తనని హుజూర్ నగర్ లో స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని తెలిపారు.

ఆ తర్వాత తనపై పెట్టుకున్న నమ్మకం తో ఏకంగా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అని సూచించారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వైసిపి పార్టీ క్రియాశీలకంగా లేకపోవటం మాత్రమే కాక, ఏటువంటి పోరాటాలు చేయటం లేదని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇదే తరుణంలో భవిష్యత్తులో ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేస్తానని, అదికూడా హుజూర్ నగర్ నుంచి అంటూ వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి ఏ జాతీయ పార్టీలో జాయిన్ అవుతారు అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

 ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దివంగత వై.ఎస్ కూతురు జగన్ చెల్లెలు షర్మిల రాజకీయంగా దూసుకుపోతుంది.ఈ తరుణంలో వైసిపి పార్టీ అధ్యక్ష పదవికి గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేయడం 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు