నీలం సాహ్ని ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నిర్ణయాలు తీసుకోవటంలో స్పీడ్ పెంచారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించి.
ఎస్ఈసీ కార్యదర్శితో సిబ్బందితో అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఈనెల ఎనిమిదో తేదీన పరిషత్తు పోలింగ్ నిర్వహించడానికి రెడీ అయ్యారు.
అదేవిధంగా 9వ తారీఖున రీపోలింగ్, 10 వ తారీఖున ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ వంటి విషయాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ మరియు తదితర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొనడం జరిగింది.
ఇదిలా ఉంటే నీలం సాహ్ని రాష్ట్రంలో తొలి మహిళ కమిషనర్ కావటం విశేషం.అదేవిధంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఆమె ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీగా ఉండటంతో ప్రతిపక్ష పార్టీ టిడిపి ఈ ఎన్నికలను బహిష్కరించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.మరోపక్క అధికారపార్టీ వైయస్ఆర్సీపీ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో మాదిరిగా ఈ పరిషత్ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంది.