నేను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను.ఇందిరాగాంధీ నుంచి అనేక మంది ప్రధాన మంత్రులను చూశాను.
రాజకీయంగా అనేక మందితో విభేదించాం.కానీ, ఈ ప్రధానిలాగా పగ, కక్షతో వ్యవహరించే ధోరణి ఎక్కడా లేదు.
ప్రతి రోజూ ఏదో ఒక అలజడి.తెల్లవారితే ఈ రోజు ఏం చేస్తారో… ఎక్కడ సమస్య తెస్తారో అని కాచుకొని చూసుకొనే పరిస్థితి తేవడం ఘోరం.
దీనిని చూస్తూ ఊరుకోవడం సరికాదు.ఎంతవరకైనా పోరాడదాం’’ అంటూ ఏపీ సైన్ చంద్రబాబు నాయుడు తన సహచర మంత్రులతో వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక మోడీ వర్సెస్ ఏపీ అనే రేంజ్ లో కేంద్రానికి కూడా చుక్కలు చూపించాలని బాబు ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.మోఢీ ని ఇప్పడు గట్టిగా ఎదిరించి పోరాడుతున్నట్టు ఏపీ ప్రజల్లో ఆ భావన కల్పిస్తే ఎన్నికల్లో కూడా తమకు కలిసి వస్తుందన్న ఆలోచనలో బాబు ఉన్నాడు.‘ఐటీ దాడులు జరగడం సహజమే.కానీ.నిర్దిష్ట సమాచారం ప్రకారం, ఒక పద్ధతితో మూకుమ్మడి దాడులు చేస్తారు.కానీ, 200 మంది అధికారులు 19 బృందాలుగా మారి… సూట్ కేసులు పట్టుకొని తిరుగుతూ భయాందోళనలు సృష్టించడం… ఎక్కడికి వెళ్తారో తెలియకుండా ఊరంతా తిరుగుతుండటం మొదటిసారి చూస్తున్నా? వీటిని ఐటీ దాడులు అంటారా లేక భయకంపిత వాతావరణం సృష్టించడం అంటారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఈ తరహా ఐటీ దాడులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్న అంశంపై చర్చ జరిగింది.ఆ అవసరం లేదని, అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని న్యాయ శాఖ కార్యదర్శి ఈ సమావేశంలో చెప్పారు.ఉద్దేశపూర్వకంగా, రాజకీయ వేధింపుల దృష్టితో చేస్తున్న ఇటువంటి దాడులకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల సహకారం ఇవ్వకూడదని నిర్ణయించారు.అంతేకాదు… కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న తీరు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను రాజకీయ ప్రత్యర్థులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయాలని, కేంద్రం వేధింపులను ధైర్యంగానే ఎదుర్కొందామని బాబు తన సహచర మంత్రులకు ధైర్యం నూరిపోస్తున్నాడు.