తెలుగు రాష్ట్రాల నేతల వెన్నులో ఇప్పుడు వణుకు పుట్టిస్తున్న ఏకైక అంశం ఐటీ దాడులు.ముందుగా తెలంగాణలో మొదలయిన ఈ దాడులు పక్క వ్యూహం ప్రకారం.
కొంతమంది నేతలని టార్గెట్ గా చేసుకుని అమలవుతున్నాయి అనేది జగమెరిగిన సత్యం.ముందస్తు ఎన్నికలు ఒక పక్క దగ్గర పడుతున్న తరుణంలో కేసీఆర్ ఐటీ దాడులని ఎంతో వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారని తెలుస్తోంది.
ఓటుకు నోటు పై కూడా విచారణ చేపట్టడం రాజకీయ వ్యూహంలో భాగమేనని అంటున్నారు టీడీపీ నేతలు.ఇదిలాఉంటే.

ఐటీ దాడులు వెనుక ముఖ్యంగా నలుగురు వ్యక్తుల ప్రమేయం ఉందని.వారిలో ఒక మహిళా నేత కూడా ఉందని టాక్ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది.ఈ విషయాని వెల్లడించింది కూడా ఎవరో కాదు వేషాలు వేయడానికి అవకాశం లేకపోవడంతో రాజకీయ వేషాలు వేస్తూ అప్పుడప్పుడు తెరపైకి బాబుకి వత్తాసు పలుకుతూ కనిపించే సినీ నటుడు శివాజీ.చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది అనుకున్నప్పుడల్లా రెక్కలు కట్టుకుని మీడియా ముందుకు వాలిపోతాడు నిన్నటిరోజున ఐటీ దాడుల విషయంపై ఊకదంపుడు ఉపన్యాసం చెప్పిన శివాజీ మధ్యలో ఒక సంచలన ఆరోపణ చేశారు.
చంద్రబాబు ప్రభుత్వానికి ముప్పుందని తాను ముందే చెప్పిన విషయాన్ని మీడియాకి తెలిపారో లేదా బాబు కి తెలిపారో తెలియదు కాని తన బాబు భక్తిని మాత్రం శివాజీ మీడియా ముఖంగా చాటుకున్నారు.అంతేకాదు బాబు ని ఎన్కౌంటర్ చేసిపడేయండి అంటూ సినిమాలో కంటే నిజ జీవితంలోనే బాగా నటించారనే ప్రశంసలు కూడా అందుకున్నారు విలక్షణ నటుడు శివాజీ.
అక్కడితో ఆగకుండా మన రాష్ట్రంలో ఉన్న నలుగురు ఆ నలుగురిలో ఒక మహిళ కలిసి ఢిల్లీ లో వేసిన స్కెచ్ పుణ్యమే ఈ ఐటీ దాడులు అంటూ బాంబు పేల్చారు.అయితే ఆ మహిళామణి పేరు చెప్పడానికి శివాజీ పేరుపెట్టుకున్న నటుడు శివాజీ మాత్రం వెనకడుగు వేశారు.

అయితే పట్టుకుంటే పట్టు చీర కాన్సెప్ట్ లాగా ఆ మహిళా మణి గురించి తెలుసుకోవాలని ఉందా అయితే.నా మాటలు వింటే ఎవరో తెలుస్తుందని క్లూ కూడా ఇచ్చారు అయితే పేరు చెప్తే నన్ను బుక్ చేయడానికి సిద్దంగా ఉన్నారు అందుకే చెప్పడంలేదని తెలిపారు.మరి శివాజీ చెప్పిన ఆ మహిళ ఎవరు శివాజీ ఆమె పేరు చెప్పడానికి ఎందుకు భయపడ్డాడు అంటే దానికి కారణాలు అనేకం ఉంటాయి ఎందుకంటే అందరిలాగానే తనని కూడా ఎక్కడ బుక్ చేసేస్తారోనని భయం శివాజీని వెంటాడుతోంది.కానీ శివాజీ మాత్రం ఏపీ ప్రజల మైండ్ లో ఆ మహిళా నేత ఎవరో అనే కన్ఫ్యూజన్ పెట్టి మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.







