కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ( YCP party ) సామాజిక సాధికార యాత్రలో మాజీమంత్రి కురసాల కన్నబాబు( Kurasala Kannababu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల సమయంలో చెప్పిన దాని కంటే అధికారంలోకి ఇంకా ఎక్కువగానే సీఎం జగన్ చేశారని వ్యాఖ్యానించారు.
దేశంలో తాను పేదవాడి పక్షం అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి( YS Jaganmohan Reddy ) అని కన్నబాబు అన్నారు.కాకినాడ రూరల్ నియోజకవర్గం తీసుకుంటే సుమారుగా 800 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఎకౌంటులలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ వేయడం జరిగింది.
ఇంచుమించు లక్షకు పైగా.లబ్ధిదారులు అంటే వారిలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి చెందినవారే.
చంద్రబాబుకి దృష్టి లోపంతో బెయిల్ మంజూరు చేయటం పై కూడా సెటైర్లు వేశారు.
చంద్రబాబుకి( Chandrababu ) దృష్టిలోపం ఉందన్నమాట నిజమే.
ఆయనకు పేదలు కనిపించరు.కేవలం ఆయన వర్గం వాళ్లే కనిపిస్తారు.
పేదల అభివృద్ధిని చూడలేక దృష్టిలోపంతో చంద్రబాబు బాధపడుతున్నారు.ఈ విషయాన్ని ప్రజలు ఎప్పుడో గమనించారు.ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పొత్తును ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కన్నబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.2014లో చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని విమర్శించారు.పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి .నేరుగా చంద్రబాబు కోసమే పని చేస్తూ ఆరోజు మద్దతు తెలిపారు.ఆ తర్వాత 2019 ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలని చంద్రబాబుకి తన పార్టీ బీఫామ్ లను అమ్మేశారు.కాగా ఇప్పుడు.మళ్లీ జతకట్టాడు.వీళ్ళిద్దరి స్నేహం కొత్త కాదు అని వ్యాఖ్యానించారు.







