చైనా అప్పులు తెలిస్తే షాక్ కావలసిందే..

ప్రపంచాన్ని కరోనాతో వణికించిన డ్రాగన్ కంట్రీ తాను చేసిన అప్పులను ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతుందని గుసగుసలు మొదలైయ్యాయట.దీనికి సమాధానంగా ఇది నిజమనే అంటున్నారు.

ఎందుకంటే గత ఏడాది నాటికి చైనా అప్పులు 2.3 లక్షల కోట్ల డాలర్లని ప్రభుత్వానికి చెందిన మేధో సంస్థ వెల్లడించింది.ఈ ఏడాది అవి మరింత పెరిగే అవకాశముందని కూడా అంటోంది.

కాగా చైనా 2035 నాటికి భారీ ఆర్థిక వృద్ధిని నమోదు చేసే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, ఈ క్రమంలోనే అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు నిర్ణయించుకుందని లీ లూ అన్నారు.కానీ ప్రస్తుతం చైనాలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యే లా లేవని పెట్టుబడులను పెంచాలన్న చైనా ప్రభుత్వ ఒత్తిడి మేరకు స్థానిక ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా పైకి కనిపించని అప్పులు చేస్తున్నాయని వెల్లడించారు.

ఇలా దాదాపు అన్ని ఆర్థిక సంస్థల నుంచి చైనా రుణాలు తీసుకుంటుండటం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు