చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి కొడుకు..!!

రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత తెరకెక్కుతున్న సినిమా RRR అని అందరికీ తెలుసు.

బాహుబలి ప్రపంచ స్థాయిలో విజయం సాధించడం మాత్రమే కాక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టించడంతో RRR ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.

  టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి చరణ్, ఎన్టీఆర్ కలసి చేస్తూ ఉండటంతో నందమూరి మరియు మెగా ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా గమనిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి కొడుకు కార్తికేయ చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.

మేటర్ లోకి వెళ్తే ఈనెల 29వ తారీఖున రామ్ చరణ్ బర్తడే కావటంతో సోషల్ మీడియాలో కార్తికేయ ని ఓ నెటిజన్ ఏమైనా సర్ ప్రైజ్ సినిమా నుండి ఉంటుందా అని ప్రశ్నించాడు.కచ్చితంగా బిగి సర్ ప్రైస్ ఉంటుంది, ఎనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేయండి అంటూ రిప్లై ఇచ్చాడు.

దీంతో వచ్చే చరణ్ పుట్టినరోజుకి మరో టీజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.అంతేకాకుండా మే నెలలో తారక్ పుట్టిన రోజు కావడంతో అప్పుడు కూడా మరో వీడియో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.

Advertisement

  .

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు