బాలయ్య ఎనర్జీని తట్టుకోవడం చాలా కష్టం అంటున్న హీరోయిన్...

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

ఇక హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా బోయపాటి స్టైల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ఈ సారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.అందులో అఘోరా పాత్ర కూడా ఒకటి ఉంది.

ఈ పాత్రలో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్స్ గా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు.

బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ వయస్సులో కూడా ఎక్కడైనా ఫుల్ ఎనర్జీతో మాట్లాడుతూ ఉంటాడు.

Advertisement

అలాగే సెట్స్ లోకి అడుగుపెట్టిన తర్వాత యాక్షన్, డాన్స్, డైలాగ్స్ ఇలా ఏ విషయంలో అయిన సింగిల్ టేక్ లో చేసేసి చూపిస్తాడు.అందుకే బాలకృష్ణని ఓ పవర్ హౌస్ తో అందరూ పోల్చుతారు.

ఇప్పుడు బాలయ్యతో కొత్త సినిమా సినిమాలో నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ కూడా అతనిపై ప్రశంసలు కురిపించింది.ఆయన ఎప్పుడు ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు.స్టార్‌ హీరో అయినప్పటికి షూటింగ్‌ సెట్‌లో ఎప్పుడు సందడి చేస్తూ తొటి నటీనటులతో సరదాగా ఉంటారు.

చాలా ఎనర్జీటిక్‌గా ఉంటారు.చెప్పాలంటే ఆయన ఎనర్జీ ఓ పవర్‌ హౌజ్‌ లాంటింది.ఎప్పుడూ పాజిటివిటీతో ఉంటారు.

అందుకే ఆయన నాకు స్ఫూర్తి.ఇక సినిమా పట్ల ఆయనకున్న అభిరుచికి ఎవరూ సాటిరారు’ అంటూ చెప్పుకొచ్చింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మొత్తానికి బాలకృష్ణతో ఒక్క సినిమా చేసేసరికి ప్రగ్యా అతని మీద ఎక్కడ లేని అభిమానం చూపిస్తూ ఉండటం చూస్తూ ఉంటే నందమూరి అభిమానులని ప్రసన్నం చేసుకోవడానికి ఈ భామ గట్టిగానే ప్రయత్నం చేస్తుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు