ఇకపై వ్యాక్సిన్ పాస్ పోర్ట్....!!

వ్యాక్సిన్ పాస్ పోర్ట్” పాస్ పోర్ట్ గురించి విన్నాం కానీ ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఏంటి అనుకుంటున్నారా.

అంత తేలిగ్గా తీసుకోకండి భవిష్యత్తులో తప్పకుండ ఇది లేదనిదే దేశ విదేశాలలోకి నో ఎంట్రీ అంట.

ఒక దేశం నుంచీ ఇంకొక దేశానికి వెళ్ళడానికి ఈ పాస్ పోర్ట్ తప్పకుండా ఉండాల్సిందే అంటున్నారు.ఇప్పటికే కొన్ని దేశాలలో అమలు అవుతున్న ఈ విధానంపై భారత ప్రభుత్వం కూడా కసరత్తులు చేస్తోంది.

ఇంతకీ ఏమిటా పాస్ పోర్ట్, దీని వల్ల ఉపయోగం ఏమిటి అనే వివరాలోకి వెళ్తే.యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన ఘటన ఇప్పటికి కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది.

ఒక దేశం నుంచీ మరొక దేశానికి కరోనా రోగులు వెళ్ళడంతో ఆయా దేశాలలో మహమ్మారి విజ్రుంభించింది.ఈ నేపధ్యంలో వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అనే అంశం తెరపైకి వచ్చింది.

Advertisement

కరోనా మహమ్మారి మాకు రాలేదు, కరోనా వ్యాక్సిన్ ను మేము ముందుగానే తీసుకున్నాం అనే ధృవపత్రాన్నే వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటారు.భవిష్యత్తులో ఈ పాస్ పోర్ట్ ప్రతీ ఒక్క తప్పనిసరి అవుతుందని నిపుణులు అంటున్నారు.

కరోనా కారణంగా కొత్త వ్యాక్సిన్ పాస్ పోర్ట్ కు ప్రతీ ఒక్కరూ అప్ప్లై చేసుకోవాలని, అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సంస్థ ఐఏటిఏ ట్రావెల్ పాస్ పోర్ట్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.అంతేకాకుండా ప్రయాణాలు చేసేవారు స్పందన వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఈ పాస్ పోర్ట్ అప్ప్లై చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు.కరోనా సోకలేదని ప్రభుత్వం ఇచ్చే పత్రాన్ని ఐఏటిఏ ట్రావెల్ పాస్ పోర్ట్ యాప్ లో పొందు పరచడం ద్వారా డిజిటల్ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను జారీ చేస్తారు.

దాంతో విదేశాలు వెళ్ళే వారు పాస్ పోర్ట్ తో పాటు డిజిటల్ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ కూడా చూపించితే సరిపోతుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు