షర్మిల పార్టీతో ఈ పార్టీకి పెద్దదెబ్బ తగలనుందా?

తెలంగాణలో రాజకీయ వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది.వ్యూహ, ప్రతి వ్యూహాలతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

అయితే ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ఉన్న రాజకీయ వాతావరణానికి తోడు వై.ఎస్.షర్మిల కూడా పార్టీ పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే షర్మిల పార్టీతో ఇప్పుడున్న ప్రతి ఒక్క పార్టీ ఓట్లు చీలిపోనున్నాయి.

ఏ పార్టీకి అతి పెద్ద దెబ్బ తగలనుంది.అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే తెలంగాణలో క్షేత్ర స్థాయి వరకు కార్యకర్తల నిర్మాణం ఉన్న పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్.

అయితే ఇప్పటివరకు తెలంగాణలో బీజేపీకి మొన్నటి వరకు పట్టు లేదు.ఇటీవల బీజేపీ ఇప్పుడిప్పుడే బలపడుతున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

అయితే ఇదే సమయంలో షర్మిల పార్టీ ఎంట్రీతో బీజేపీకి రావలసిన టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు షర్మిల పార్టీ వైపు వెళ్లే అవకాశం ఎక్కువ.ఎందుకంటే ఖమ్మం జిల్లా, తెలంగాణలోని మిగతా కొన్ని జిల్లాల్లో షర్మిల పార్టీ గాలి వీస్తే ఇక బీజేపీకి గడ్డు కాలమనే చెప్పవచ్చు.

అయితే షర్మిల పార్టీ ప్రకటన తరువాత పార్టీ విధి విధానాలు తెలిసిన తరువాత షర్మిల పార్టీ గురించి ప్రజలకు, రాజకీయ పార్టీలకు ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది.ఏది ఏమైనా షర్మిల పార్టీ ప్రకటన తరువాత రోజుకో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి.

అయితే టీఆర్ఎస్ కు కూడా కొంత నష్టం వాటిల్లినా భారీ నష్టం అయితే కలగక పోవచ్చు.చూద్దాం భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు