జాన్వీకపూర్ కు ఇష్టమైన పర్సన్ రామ్‌దాస్‌.. ఎవరో తెలుసా?

అతిలోక సుందరి అలనాటి తార శ్రీదేవి కూతురు నటి జాన్వికపూర్ గురించి అందరికీ తెలిసిందే.

ఆమె తన తల్లి వలె అందంగా కనిపిస్తూ ఎంతో మంది అభిమానులను పెంచుకుంది.

అంతేకాకుండా ఆమె బాలీవుడ్ లో నటిస్తూ.చీరకట్టులో తెలుగు బాపుబొమ్మల ఆకట్టుకుంటుంది.

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది.ఆమెకు తన కుటుంబం పట్ల ఉన్న ప్రేమను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.

ఇదిలా ఉంటే తను తాజాగా తనకు ఇష్టమైన పర్సన్ రామ్ దాస్ ను పరిచయం చేసింది.జాన్వీ కపూర్ కు తన జీవితంలో తన కుటుంబ సభ్యులే కాకుండా మరో ఫ్రెండ్ కూడా ఉన్నారు.

Advertisement

ఆ ఫ్రెండ్ పేరే రామ్ దాస్.ఇంతకీ రామ్ దాస్ అనే పర్సన్ ఎవరో కాదు.తాను పెంచుకుంటున్న కుక్క పిల్ల.

దాని పేరే రామ్ దాస్.జాన్వీ కపూర్ కు రామ్ దాస్ అంటే ఎంతో ఇష్టమట.

తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో రామ్ దాసు తో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.అంతేకాకుండా మీట్ మిస్టర్ రామ్ దాస్ అంటూ క్యాప్షన్ ఇస్తూ పరిచయం చేసింది.

ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ప్రస్తుతం సిద్ధార్థ సేన్ గుప్తా దర్శకత్వం లో తెరకెక్కనున్న గుడ్ లక్ జెర్రీ సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా మరో సినిమా రూహీ లో నటిస్తుంది.మరో సినిమా దోస్తానా 2 లో హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

ఇదిలా ఉంటే బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మొత్తానికి జాన్వీ కపూర్ వరుస సినిమాలలో బిజీ గా మారింది.

తాజా వార్తలు