బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీరెడ్డి... ఇక్కడ కాదు

టాలీవుడ్ లో చేసిన సినిమాలు ఎవరికీ తెలియకపోయిన హీరోయిన్ అనే బ్రాండ్ తో భాగా పాపులర్ అయిన బ్యూటీ శ్రీరెడ్డి.

ఈ అమ్మడు తెలుగులో ఒకటి, అర సినిమాలలో నటించిన రాని గుర్తింపు టాలీవుడ్ లో స్టార్ హీరోలైన నాని, రానా, సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ మీద కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడం ద్వారా వచ్చింది.

తరువాత పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టి ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయిపొయింది.అప్పుడప్పుడు టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ మీద తనకి ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ, అలాగే ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఈ అమ్మడు పోస్టులు పెడుతుంది.

దీంతో సోషల్ మీడియాలో ఎక్కువగా అందరి దృష్టిలో పడుతుంది.అలాగే కాస్తా శ్రుతిమించి ఫోటోలు తీసుకుంటూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

నటిగా ఈమెకి వచ్చిన గుర్తింపు కంటే వివాదాలతో వచ్చిన గుర్తింపే ఎక్కువ.ఈ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 2లో ఈమెని పార్టిసిపెంట్ గా పిలవాలని అనుకున్న ఏవో కారణాల వలన ఆపేశారు.

Advertisement

అప్పటి నుంచి బిగ్ బాస్ మీద కూడా తన అక్కసు వెళ్ళగక్కుతుంది.అయితే ఇప్పుడు అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 5లో ఈ అమ్మడి పాల్గొనే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.

అయితే అది కమల్ హసన్ హోస్ట్ గా వస్తున్న తమిళ్ బిగ్ బాస్ షో నుంచి అని టాక్.బిగ్ బాస్ కోసం ఇతర బాషలకి చెందిన వారిని కూడా పార్టిసిపెంట్స్ గా తీసుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో ఈ సీజన్ తమిళ్ బిగ్ బాస్ కోసం శ్రీరెడ్డికి కాల్ వచ్చినట్లు తెలుస్తుంది.ఇది నిజమే అయితే ఆ షోని ఉపయోగించుకొని కోలీవుడ్ ఈ అమ్మడు నటిగా మరిన్ని అవకాశాలు పెంచుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు