వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్..!

ఇప్పటికే ప్రపంచం కరోనా వైరస్ నుండి మెల్లమెల్లగా కోలుకుంటూ బయటకు వస్తున్న తరుణంలో ఇప్పుడు మరో కొత్తరకం కరోనా వైరస్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.

ఇప్పటికీ దేశంలో మూడు రాష్ట్రాలలో కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఇదివరకే కొత్తరకం స్ట్రెయిన్ వెలుగులోకి రాగా.దీని ప్రభావం వల్లే ఈ కొత్త రకం కరోనా దరి చేరిందని నిపుణులు తెలుపుతున్నారు.

గత ఏడాది నుంచి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇక ఆ వైరస్ కు వ్యాక్సిన్ ను కనుక్కోగా ఇటీవలే వ్యాక్సిన్ టీకాలను ప్రపంచం మొత్తం సరఫరా చేశారు.

ఇదిలా ఉంటే వ్యాక్సిన్ టీకాలు పూర్తి స్థాయిలో అందక ముందే ఈ కొత్తరకం వైరస్ నుండి భయాందోళనలు ఎదురవుతున్నాయి.మహారాష్ట్ర, కేరళ, తెలంగాణలో N440K, N484K వైరస్ లు బయటపడ్డాయి.

Advertisement

ఈ వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.పంజాబ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో ఎక్కువగా ఈ వైరస్ విస్తరించింది.

దీనిని అంతం పట్టించేందుకు ఇప్పటికే నిపుణులు రంగంలోకి దిగారు.

ఇక మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా ఉండటంతో మరోసారి లాక్ డౌన్ ను విధించనున్నారు.ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో పాఠశాలలను, కొన్ని సంస్థలను మూసి వేశారు.పూణే, అమరావతి, నాగపూర్, యావత్మల్ ప్రాంతాల్లో లాక్ డౌన్ చర్యలు మొదలు పెట్టారు.

ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలలో రాత్రిపూట కర్ఫ్యూ అందించాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అధికారులకు ఆదేశించారు.ఇక తెలంగాణలో సరిహద్దు జిల్లాలో ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలను విధించింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లకి అక్కడి నుండే పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.ఇదిలా ఉంటే ఈ వైరస్ వల్ల కేరళ, కర్ణాటక మధ్య వివాదాలు ఎదురవుతున్నాయి.

Advertisement

కేరళలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కేరళ, కర్ణాటక మధ్యలో ఉన్న సరిహద్దును మూసివేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీ ఎస్ యడ్యూరప్ప ఆదేశాలు జారీ చేశారు.దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండదు కూడదని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలపగా దీని గురించి కేరళ ప్రభుత్వం ఆగ్రహం చూపిస్తుంది.

రాష్ట్రాల మధ్య సరిహద్దులు తెరవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.ఇక మొత్తానికి ఈ కొత్త కరోనా వైరస్ వల్ల తీవ్ర ఆందోళన ఎదురవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.

తాజా వార్తలు