సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత దారుణమైన జీవితాన్ని పేస్ చేసిన నటి రియా చక్రవర్తి.తెలుగులో తూనీగ తూనీగ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ తరువాత బాలీవుడ్ లోకి వెళ్ళిపోయి అక్కడ సుశాంత్ తో ఒక సినిమాలో నటించింది.
అక్కడ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆఫ్ స్క్రీన్ లో కూడా తరువాత కొనసాగింది.సుశాంత్ ప్రియురాలిగా బి టౌన్ లో అందరికి రియా పేరు బాగా తెలిసిపోయింది.
అయితే ఉన్నపళంగా సుశాంత్ కి రియా బ్రేక్ అప్ చెప్పిన వారం రోజుల వ్యవధిలోనే అతను ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కేసు అంతా రియా మెడకి చుట్టుకుంది.ఆమె కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని బిటౌన్ లో కథనాలు వినిపించాయి.
కొంత మంది అయితే సుశాంత్ ని రియా ప్రేమించడం వెనుక, అతనికి బ్రేక్ అప్ చెప్పడం వెనుక కుట్ర కోణం ఉందని, మహేష్ భట్ ప్లాన్ లో భాగంగా రియా చక్రవర్తి అలా చేసిందని ప్రచారం కూడా చేశారు.
ఇదే సమయంలో సుశాంత్ సింగ్ కి రియా డ్రగ్స్ అందించేది అనే విషయం బయటపడటంతో ఆమెని ఆ కేసులో అరెస్ట్ చేశారు.
దీంతో జైలు జీవితం గడపాల్సి వచ్చింది.డ్రగ్స్ ఫ్లీడర్ గా వ్యవహరిస్తూ ఆమె చాలా మంది సెలబ్రెటీలకి డ్రగ్స్ సప్లై చేసేదని ఆరోపణలు వినిపించాయి.ఎట్టకేలకు ఆమెకి డ్రగ్స్ కేసులో కోర్టు బెయిల్ ఇచ్చింది.ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్న ఆమె తన చుట్టూ ఉన్న గందరగోళం నుంచి బయటపడాలని సినిమాలలో బిజీ అవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.
తెలిసిన ప్రతి ఒక్కరిని సంప్రదిస్తుంది.అప్పుడు సుశాంత్ కోసం తెలుగు సినిమాలలో వచ్చిన అవకాశాలు వదులుకున్న రియా చక్రవర్తికి మళ్ళీ టాలీవుడ్ లో ఓ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.
తెలుగులో ఇది వరకు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి ఛాన్స్ మిస్ చేసుకుంది.ఇప్పుడు మరోసారి అలాంటి తప్పు చేకూడదని ఫిక్స్ అయినా అమ్మడు సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు బోగట్టా.