న్యూస్ రౌండప్ టాప్ - 20

1.వారణాసికి కేసీఆర్ ఫ్యామిలీ

తెలంగాణ సీఎం కేసీఆర్ భార్య శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఇతర కుటుంబ సభ్యులు నేడు, రేపు వారణాసిలో ని వివిధ ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు.

2.మటన్, బీఫ్ దుకాణాల బంద్

ఈ నెల 30 న మహాత్మాగాంధీ వర్ధంతి ని పురస్కరించుకుని గ్రేటర్ పరిధిలోని ప్రాంతాల్లో మటన్ , బీఫ్ దుకాణాలను మూసివేయాలని జిహెచ్ఎంసి అధికారులు ఆదేశించారు.

3.బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా

ఆర్టీసీ మాజీ చైర్మన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమవారపు సత్యనారాయణ బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

4.ఏపీలో పోలీసులకు సెలవులు రద్దు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెల రోజుల పాటు పోలీసులకు సెలవులు రద్దు చేశారు.ఈ మేరకు శాంతి భద్రతల ఏడిజి రవిశంకర్ అయ్యన్నార్ అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

5.గవర్నర్ తో బీజేపీ, జనసేన నేతలు

ఈ రోజు జనసేన, బీజేపీ నేతలు ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హారిచందన్ తో భేటీ అవుతున్నారు.

6.గ్రూప్ 2 సెలెక్టెడ్ అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన

గ్రూప్ 2 సర్వీసెస్ కింద ప్రోవిజినల్ గా సెలెక్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన ఫిబ్రవరి 10న జరుగుతుందని ఏపీ పీయేస్సి ప్రకటించింది.

7.హౌసింగ్ ఎండీ గా భరత్ గుప్త

ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గా నారాయణన్ భరత్ గుప్త ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

8.ఓటర్ల జాబితాపై నేడు హై కోర్టు లో విచారణ

Advertisement

పంచాయితీ ఎన్నికల ఓటర్ల జాబితా వ్యవహారంలో నేడు ఏపీ హై కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.దీనిపైన నేడు విచారణ జరగనుంది.

9.అభిశంసన అధికారం కమిషన్ కు లేదు

పంచాయితీ రాజ్, గ్రామీణాభవృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది , కమిషనర్ గిరిజా శంకర్ వారిద్దరూ యథావిధిగా విధుల్లో కొనసాగు తారని, వారిద్దరిపై కమిషన్ జారీ చేసిన అభిశంసన తీర్మానం చెల్లదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

10.31వరకు ఎర్రకోట మూసి వేత

రిపబ్లిక్ పేరైడ్ సందర్భంగా రైతులు కొంత మేర ఎర్ర కోటను ధ్వంసం చేసిన నేపథ్యంలో  ఈ నెల 31వరకు ఎర్రకోట ను మూసే ఉంచుతారు.

11.రైతు నేత దర్శన్ పాల్ కు నోటీసులు

ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో క్రాంతికారి కిసాన్ యూనియన్ నాయకుడు దర్శన్ పాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

12.తెలంగాణ లో కరోనా

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.అచ్చెన్నాయుడు కి నోటీసులు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కి పోలీసులు నోటీసులు జారీ చేశారు.సంతబొమ్మాళి పాలేశ్వర స్వామి ఆలయ నంది విగ్రహం తరలింపు పై విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

14.రేషన్ డోర్ డెలివరి పై ఎస్ ఈసీ ఆరా

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రేషన్ డోర్ డెలివరి చేయడం పై రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను ఆరా తీశారు.

15.న్యూ ఢిల్లీ లో భూకంపం

దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు భూకంపం వచ్చింది.రిక్టర్ స్కేల్ పై 2.8 గా నమోదయ్యింది.

16.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,666 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

17.ఏపీలో కరోనా

గడిచిన 24గంటల్లో ఏపీలో 111కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

18. పుష్ప విడుదల తేదీ ఇదే

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాను ఆగస్ట్ 13 న రిలీజ్ చేస్తున్నట్టు ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది.

19. కోయిలమ్మ నటుడిపై కేసు నమోదు

కోయిలమ్మ సీరియల్  నటుడు అమర్ శశాంక్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.అమర్ తనను లైంగికంగా వేధించాడు అని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు  ఈ కేసు నమోదయ్యింది.

20.ఈ రోజు బంగారం ధరలు

Advertisement

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,650 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,800 .

తాజా వార్తలు