ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన మాస్ రాజా!

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ క్రాక్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

కాగా ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న రవితేజ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా అప్పుడే లైన్‌లో పెడుతున్నాడు.

దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఖిలాడి’ చిత్రంలో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించడంలో సక్సె్స్ అయ్యాయి.

కాగా జనవరి 26న పుట్టినరోజు జరుపుకుంటున్న మాస్ రాజా, తన అభిమానులు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.ఖిలాడి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియో అల్ట్రా స్టైలిష్‌గా ఉండటంతో రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.క్రాక్ చిత్రం సక్సెస్‌ను ఇంకా ఎంజాయ్ చేస్తున్న రవితేజ ఫ్యాన్స్‌కు ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో మాస్ రాజా లుక్ బాగా నచ్చింది.

Advertisement

స్టైలిష్‌గా చేతిలో రాడ్ పట్టుకుని రవితేజ ఎంట్రీ ఇచ్చిన విధానం, దానికి తగ్గట్టుగా వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సూపర్‌గా మార్చాయి.ఇక పూర్తి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కాగా ఈ సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి ఖిలాడి చిత్రంతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు