హమ్మయ్యా.. జాక్ కనిపించాడోచ్..!

చైనా దిగ్గజ వ్యాపారవేత్త ఆలీబాబా సంస్థ వ్యవస్థాపకుడు జాక్ మా ఎట్టకేలకు కనిపించాడు.

దాదాపు 3 నెలల పాటు ఎవరికీ కనిపించని ఆయన, తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చాడు.

ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీచర్లను ఉద్దేశిస్తూ జాక్ మా ప్రసంగించారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే ప్రతి సంవత్సరం గ్రామీణ ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టీచర్స్ ని ఉద్దేశించి ప్రసంగించారు.ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఈ సంవత్సరం కరోనా వైరస్ కారణంగా ఈ కార్యక్రమాన్ని వర్చువల్ వేదికగా నిర్వహించినట్లు సమాచారం.ఇక ఆ వీడియోలో జాక్ మా తాను ఎక్కువ సమయం పరోక్షంగానే కనిపిస్తానని తెలియజేశాడు.

Advertisement

దాదాపు 3 నెలల పాటు జాక్ మా కనిపించకపోవడంతో అనేక అనుమానాలతోపాటు ఆలీబాబా అమ్మకాలు కూడా కాస్త తక్కువ జరిగాయి.మరి తాజాగా జాక్ మా ప్రజల ముందుకు దర్శనమివ్వడంతో మళ్ళీ తిరిగి లాభాల వైపు పట్టింది ఆలీబాబా సంస్థ.

అయితే, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు.? ఏం చేస్తున్నాడు.? అన్న విషయాలు మాత్రం బయటకు తెలియలేదు.

ఇక అక్టోబర్ నెల నుంచి ఆయన వ్యాపార సంస్థలు అన్నీ కూడా నష్టాలలో ఉన్నాయని, భారత్ కరెన్సీ ప్రకారం ఆయన సంస్థలు అన్నీ కూడా 83 వేల కోట్లలో నష్టపోయాయని సమాచారం.చైనా లో మాత్రమే కాకుండా ప్రపంచంలో అత్యధిక ధనవంతులలో జాక్ మా కూడా ఒకరుగా నిలిచారు.ఇదివరకు ఆయన సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు వుండి మంచి పేరు సంపాదించుకున్న జాక్ మా.గత కొన్ని నెలలుగా కనపడకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనమే సృష్టించింది.ఎట్టకేలకు జాక్ మా జాడ కనపడంతో అయిన అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయాయి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు