కనుమ విశిష్టత: పాడి పశువులకు పూజలు ఎందుకు చేస్తారు?

హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి.మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో భాగంగా చివరి రోజున కనుమ పండుగను జరుపుకుంటారు.

కనుమ పండుగను ప్రత్యేకించి పాడి పశువులకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అయితే ఈ కనుమ పండుగ రోజు పశువులకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో ఇక్కడ తెలుసుకుందాం సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం జనవరిలో వస్తుంది.

ఈ సమయానికి రైతులు పండించిన పంటలన్నీ ఇంటికి చేరుకుంటాయి.అందువల్ల రైతులు ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకోవడం వల్ల దీనిని రైతుల పండుగ అని కూడా పిలుస్తారు.

రైతు ఈ పండుగ రోజు ఎంతో సంతోషంగా ఉంటాడు.ఆ విధంగా సంతోషంగా ఉండటానికి గల కారణం పశువులు.

Advertisement

రైతు పండించే పంటలలో చేదోడువాదోడుగా ఉండి, రైతులకు తన వంతు సహాయం చేస్తాయి.కాబట్టి ఈ పండుగ చివరి రోజయిన కనుమను పశువుల పండుగగా కూడా భావిస్తారు.

కనుమ రోజు ఉదయం పశువుల పాకలో కడిగే పశువులను ప్రత్యేకంగా అలంకరిస్తారు.పశువులకు స్నానాలు చేయించి పసుపు కుంకుమ బొట్లు పెట్టి, వాటి కొమ్మలకు ప్రత్యేకంగా అలంకరిస్తారు.

అంతేకాకుండా కాళ్ళకు గజ్జలు, మెడలో గంటలు వేసి కనుమ రోజున పూజిస్తారు.అదే కాకుండా రైతులు పండించిన పంటను ఉపయోగించి చక్కెర పొంగలి తయారు చేసి పశువులకు నైవేద్యంగా సమర్పిస్తారు.

అంతే కాకుండా మన ఇంట్లో చేసుకున్న పిండి వంటలు కూడా పశువులకు పెడతారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఈ విధంగా కనుమ పండుగ రోజు పశువులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చి పూజిస్తారు.అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో కనుమ పండుగ రోజు పెద్ద ఎత్తున ఎద్దుల బండి పోటీలు, కోడి పందాలు నిర్వహిస్తుంటారు.వీటిని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం విశేషమని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు