పవన్ పైనే ఆశలు ! ఆయనే బీజేపీ రథ చక్రం ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బిజెపి అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమానాలకు అసంతృప్తులకు గురిచేస్తున్నా, జనసేన బిజెపి ఒంటరి పోరాటం నమ్ముకుని ముందుకు వెళ్తూ ఎవరికి వారు బలం పెంచుకోవాలని చూస్తూ వచ్చారు.

కానీ ఈ రెండు పార్టీల నేతలకు పొత్తు తప్పనిసరి అయ్యింది.

విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేస్తే, ఆ తరువాత జరిగే నష్టం ఏమిటి అనే విషయం రెండు పార్టీల అధినేతలకు బాగా తెలుసు.అందుకే  కలిసి రాజకీయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏపీలో ఎప్పటి నుంచో బలమైన రాజకీయ పార్టీగా ముద్ర వేయించుకోవాలని చూస్తున్నా, ఆ ఆశ తీరడం లేదు.దీనికి ప్రధాన కారణం ఏపీలో క్షేత్రస్థాయిలో బీజేపీకి బలం లేకపోవడమే.

సొంతంగా ఆ బలం పెంచుకోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నా, దానికి అనువైన పరిస్థితులు మాత్రం ఏర్పడడం లేదు.కానీ జనసేన కు మాత్రం రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలు ఉన్నా,  క్షేత్రస్థాయిలో జనసేన కు అభిమానుల అండదండలు, బలమైన సామాజిక వర్గం మద్దతు అన్ని ఉన్నాయి.అందుకే జనసేన ను కలుపుకొని వెళ్తేనే రాజకీయంగా పైచేయి సాధించవచ్చు అనే విషయాన్ని బిజెపి గుర్తించి, పవన్ ను ముందు పెట్టుకునే రాజకీయం చేయాలని చూస్తోంది.

Advertisement

కొద్దిరోజులు ఏపీ లో చోటుచేసుకున్న విగ్రహాల ధ్వంసం వ్యవహారం లో జనసేన బిజెపి గట్టిగానే ఏపీ ప్రభుత్వంపై పోరాడాయి.పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ హడావుడి సృష్టించాయి.

ఇప్పుడు అదేహిందుత్వ అజెండాతో బిజెపి రథయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతోంది .కానీ పవన్ ద్వారా వెళితే అది సక్సెస్ అవుతుందని బిజెపి నమ్ముతోంది.అందుకే ఈ రథయాత్రను పవన్ ద్వారానే సక్సెస్ చేసుకోవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.

ముందు ముందు పవన్ ను ముందర పెట్టి రాజకీయ నడిపించాలని ఆ విధంగా అయితేనే అనుకున్న మేరకు సక్సెస్ సాధించగలమని బిజెపి నమ్మడం అధిష్టాన పెద్దల నుంచి ఇదే అభిప్రాయం వ్యక్తం కావడంతో ఏపీలో ఇకపై పవన్ కు మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశం కనిపిస్తోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు