వైరల్: చెల్లెలు పడే బాధ చూడలేక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అన్నయ్య..!

సాధారణంగా ఇంట్లో పిల్లలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు ఉంటే వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

ఒక్కోసారి వారి చేసే అల్లరికి ఇంకా చిరాకు వచ్చేస్తుంటుంది.

అయితే అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల లాంటి వారు ఉంటే వారి చేసే అల్లరి మరో రేంజ్ లో ఉంటుంది.అంతేకాదు ఒకవైపు అల్లరితో కూడిన గొడవలు, మరోవైపు వారి మధ్య ఉండే ప్రేమలు కూడా అదే రేంజ్ లో ఉంటుంది.

ఒక్కొక్కసారి ఆ పిల్లల ప్రేమాభిమానాలు చూసి పెద్దలు తెగ సంబరపడిపోతూ ఉంటారు.తాజాగా ఇలాంటి విషయం ఒకటి చోటు చేసుకుంది.

తాజాగా ఓ వ్యక్తి తన చెల్లెలి సంతోషం కోసం రేయింబవళ్లు కష్టపడి తన సోదరికి ఖరీదైన మ్యాక్ బుక్ ను కొని సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేశాడు.ఇందుకు సంబంధించిన వివరాల లోకి వెళితే.

Advertisement

అజయ్ కర్ అనే యువకుడు తన చెల్లి కోసం ఇచ్చిన గిఫ్ట్ ను చూసి నెటిజెన్స్ వావ్ అని అంటున్నారు.తన చెల్లెలి కోసం.

పనికిరాకుండా పోయిన చెల్లెలి లాప్టాప్ స్థానంలో కొత్త మ్యాక్ బుక్ ను గిఫ్ట్ గా అందజేశాడు.దీంతో ఊహించని విధంగా తన అన్న సర్ప్రైజ్ ఇవ్వడంతో ఆ చెల్లెలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.

ఈ విషయాన్ని మొత్తం ఆ యువకుడు స్క్రీన్, కీబోర్డ్ రెండు విడిపోయిన పాత లాప్టాప్ ఫోటోలను, కొత్త మ్యాక్ బుక్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

చెల్లెలిపై ఆ యువకుడు చూపిన ప్రేమకు నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు.అలాగే సినిమాల్లో చూపించే విధంగా అన్న చెల్లెల అనుబంధం గురించి పాటలను పేర్కొంటూ ఆ యువకుడిని ప్రశంసిస్తున్నారు నెటిజన్స్.

Advertisement

ఇందులో భాగంగానే ఓ మహిళ ప్రస్తుత రోజుల్లో కూడా ఇలాంటి ప్రేమ చూపించే వారు ఇంకా ఉన్నారా.? అంటూ కామెంట్ చేసింది.అలాగే మరో యువతి మా అన్నయ్య నా లాప్టాప్ నువ్వు పాడు చేయకుండా ఉంటే చాలు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా అనేక మంది ఆ పోస్టుకు ఎత్తున కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు.మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ మ్యాక్ మోడల్ ధర రూ.1,22,900.ఇంత విలువైన వస్తువులు మేము కొనడానికి చాలా కష్టపడాలి అని కూడా కామెంట్స్ పెడుతున్నారు.

ఏది ఏమైనా ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధం చాలామందికి స్ఫూర్తిని ఇస్తుంది.

తాజా వార్తలు