ఖిలాడితో చిందులేయనున్న పవన్ మరదలు!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘క్రాక్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమాలో రవితేజ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు రవితేజ.

దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఖిలాడి అనే సినిమాలో నటిస్తున్న మాస్ రాజా.పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో ఓ అదిరిపోయే హాట్ ఐటెం సాంగ్ ఉండబోతుందని, అందులో ఓ క్రేజీ బ్యూటీ మాస్ స్టెప్పులతో రచ్చ లేపనున్నట్లు తెలుస్తోంది.అందాల భామ ప్రణీత సుభాష్ ఈ సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్‌లో రవితేజతో చిందులేయనున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

Advertisement

పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలోని బాపుగారి బొమ్మో అనే పాటలో ప్రణీత పర్ఫార్మెన్స్‌కు అప్పట్లో మంచి క్రేజ్ ఏర్పడింది.దీంతో ఇప్పుడు ఈ బ్యూటీని ఐటెం సాంగ్‌లో తీసుకునేందుకు ఖిలాడి యూనిట్ రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమాలో రవితేజ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.మరి ఖిలాడి చిత్రంలో ప్రణీత ఐటెం సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు