అమెరికాపైనే ఎందుకంత పగ..ఒక్క రోజులో అన్ని మరణాలా..!!!

మాయదారి కరోనా మహమ్మారి అమెరికాపై కనీసం కనికరం కూడా చూపడంలేదు.ఏలినాటి శనిలా ఇప్పటికి పట్టి పీడిస్తూనే ఉంది.

ఐతే అమెరికన్స్ స్వయంక్రుపరాధం ఇందులో కొంత లేకపోలేదు.ప్రభుత్వం కూడా అమెరికన్స్ ను కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోలేక పోయింది ఫలితంగా రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో మరణాలు నమోదు అవుతున్నాయి.ఇప్పటి వరకూ కరోనా కారణంగా సుమారు 3 లక్షలకు పైగానే మృతి చెందగా, దాదాపు 1.70 కోట్ల మంది ప్రజలు కరోనా బారిన పడ్డట్టుగా తెలుస్తోంది.ఇదిలాఉంటే నిన్నటి ఒక్కరోజున సుమారు 3700 మరణించడంతో ఒక్క సారిగా ప్రభుత్వ వర్గాలు షాక్ అయ్యాయి.కేవలం మరణాలు మాత్రమే కాదు నిన్నటి రోజున కరోనా బాధితుల సంఖ్య 2.50 లక్షలు నమోదు అయ్యింది.అయితే ఇప్పటి వరకూ ఈ స్థాయిలో మరణాలు నమోదు కాలేదని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది.

ఒకే రోజు ఇంతమంది మరణించడం ఆందోళన కలిగించే విషయమేనని అంటున్నారు నిపుణులు.కరోనా మార్చి లో మొదలవగా అప్పటికంటే కూడా ప్రస్తుతం ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని అమెరికా ఆరోగ్య, మానవ వనరుల శాఖ ప్రకటించింది.అయితే

అమెరికా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలయ్యింది కాబట్టి పరిస్థితులు త్వరలోనే అదుపులోకి రావచ్చని , అమెరికన్స్ భయాందోళనలకు లోనవ్వద్దని తెలిపింది.ఫైజర్ వ్యాక్సిన్ ఇప్పటికే చాలామంది అమెరికన్స్ కు అందుబాటులో ఉంది.ఈ క్రమంలోనే మొర్నాడే వ్యాక్సిన్ కూడా త్వరలో అమెరికన్స్ కు అందుబాటులోకి రానున్నది.

Advertisement

ఎఫ్డీఏ తుది నిర్ణయం తీసుకుంటే అతి త్వరలో మొర్నాడే వ్యాక్సిన్ అమెరికా మార్కెట్ లోకి విడుదల అవ్వడానికి సిద్దంగా ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు