గ్రేటర్ పై మరో సర్వే ? కేటీఆర్ ఎక్కడా తగ్గట్లే ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏదోరకంగా పట్టు సాధించుకునేందుకు అధికార పార్టీ టిఆర్ఎస్ చేయని ప్రయత్నం అంటూ లేదు.

అసలు మొదటి నుంచి గ్రేటర్ పై టిఆర్ఎస్ జెండా ఎగురుతుంది అనే ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చిన ఆ పార్టీ, అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల కారణంగా నగర జీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం వంటి కారణాలతో వేల కోట్లు కుమ్మరించి గ్రేటర్ లో అభివృద్ధి పనులు చేపట్టినట్టుగా గొప్పగా చెప్పుకున్న అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఒక్కసారిగా కోలుకోలేని దెబ్బ తగిలింది.

దీంతో పాటు దుబ్బాకలో అనూహ్యంగా ఓటమి పాలవడం కూడా టిఆర్ఎస్ కు ఇప్పటికీ మింగుడు పడని అంశంగా మారింది.ఈ సమయంలో గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనే విషయంలో ఆ పార్టీ ఎటు తేల్చుకోలేక పోతోంది.

కష్టమైన నష్టమైన, ఎన్నికలకు వెళదామనే ఆలోచనలో ముందుగా కేటీఆర్ అభిప్రాయపడినా, ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.దీనికి కారణం వివిధ సర్వేల్లో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఇప్పుడు ఎన్నికలకు వెళితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందనే రిపోర్ట్స్ అందడమే కారణమట.

అది కాకుండా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు ముగించాలని ముందుగా ఎన్నికల సంఘం అభిప్రాయపడినా, ప్రభుత్వం వెనకడుగు వేసింది.దీనికి కారణం వరద సహాయ కార్యక్రమాలు పూర్తిగా ప్రజలకు అందకపోవడం, అందిన సాయం లో అవినీతి జరిగినట్లు విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, ప్రజలలోనూ తీవ్ర వ్యతిరేకత ఉండడం వంటి కారణాలతో, జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

అప్పటిలోగా ప్రభుత్వపరంగా గ్రేటర్ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు మెరుగుపరిచి, ప్రజలంతా వరద ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత మాత్రమే ఎన్నికలకు వెళ్తేనే మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.దీనికితోడు వివిధ సర్వేల్లోనూ టిఆర్ఎస్ కార్పొరేటర్ల వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, మరోసారి పూర్తిస్థాయిలో సర్వే చేయించాలని అభిప్రాయంలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.సర్వే ఆధారంగా సీట్ల కేటాయింపు, తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిపై కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో కేటీఆర్ ఉన్నారట.

ఏది ఏమైనా టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రం గ్రేటర్ ఎన్నికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.అందుకే వ్యక్తిరేకతను తగ్గించుకునేందుకు అన్నిరకాలుగా కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు