నిన్న సమంత నేడు తమన్నా ఆహా..!

తెలుగు భాష కంటెంట్‌ తో తెలుగు వారి కోసం ప్రత్యేకంగా మొదలైన ఆహా ఓటీటీ మెల్ల మెల్లగా ఊపందుకుంటుంది.

ఓటీటీ అంటే సినిమాలు వెబ్‌ సిరీస్‌లు మాత్రమే అనుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు గాను ఆహా రెడీ అవుతుంది.

ఇప్పటికే పలు టాక్‌ షోలు వెబ్‌ సిరీస్‌ లు కొత్త సినిమాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రకటించిన ఆహా వారు ఇటీవలే సమంత హోస్ట్‌గా సామ్‌ జామ్ అనే టాక్‌ షోను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు.సమంత హోస్ట్‌ గా అంటే ఖచ్చితంగా అద్బుతంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ప్రముఖ స్టార్ హీరోలు మరియు ఫిల్మ్‌ మేకర్స్‌ ఈ టాక్‌ షోలో గెస్ట్‌లుగా పాల్గొనడం వల్ల ఖచ్చితంగా మంచి వ్యూవర్‌ షిప్‌ వస్తుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈసమయంలోనే తెలుగు ఓటీటీ కంటెంట్‌ గా 11త్‌ అవర్‌ అంటూ తమన్నా హీరోయిన్‌గా ఒక వెబ్‌ సిరీస్‌ మొదలు కాబోతుంది.

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్‌ లుక్‌ను రివీల్‌ చేశారు.దర్శకుడిగా పలు సినిమాలు తీసి జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌.

Advertisement

ఈయన దర్శకత్వంలో ఈ వెబ్‌ సిరీస్‌ అవ్వడంలో ఆసక్తి నెలకొంది.తమన్నా మొదటి సారి వెబ్‌ కంటెంట్‌లో నటిస్తున్న కారణంగా కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ వెబ్‌ సిరీస్‌ ఉంటుందని అంటున్నారు.ఆహా వారు ఏం తీసుకున్నా కూడా ఆచి తూచి తీసుకుంటున్నారు.

అన్ని కూడా ఒక మంచి మెసేజ్‌ తో పాటు యూత్‌ కు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా అందిస్తుంటాయి.సమంత టాక్‌ షో ను ఇటీవలే ప్రారంభిస్తున్నట్లుగా అనౌన్స్‌ చేసిన ఆహా వారు ఇప్పుడు తమన్న వెబ్‌ సిరీస్‌ ను కూడా ప్రకటించడంతో ఆహా గురించి మరింత చర్చ జరిగింది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు