మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన మోహన్‌లాల్ లూసీఫర్ ను తెలుగులో రీమేక్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి భావించారు.ఆయన వద్దకు ప్రముఖ నిర్మాత రీమేక్ విషయాన్ని తీసుకు రాగా తప్పకుండా చేద్దాం అయితే తెలుగు వారికి ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తే నచ్చదు.
కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కథను రెడీ చేస్తే చేద్దాం అన్నట్లుగా హామీ ఇచ్చాడు.మొదట ఈ సినిమా రీమేక్ బాధ్యతను సుజీత్‌కు అప్పగించాడు.
ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించమంటే మొత్తం సినిమా కథను మార్చేశాడు.మెయిన్ పాయింట్ కూడా మిస్ అయ్యేలా స్క్రిప్ట్ ఉండటంతో బాబోయ్ ఏంటీ బాబు ఇది అంటూ సుజీత్ ను సున్నితంగా తిరష్కరించారు.
ఆయన స్థానంలో వివి వినాయక్ వచ్చి చేరాడు.ఇప్పటికే చిరంజీవితో రెండు రీమేక్‌లు తెరకెక్కంచిన రికార్డు వినాయక్‌కు ఉంది.
అందుకే లూసీఫర్ రీమేక్‌ను కూడా ఆయనకే అప్పగించే విషయమై చర్చలు జరిగాయి.అందుకు వినాయక్ కూడా ముందుకు వచ్చాడు.
వినాయక్ తన టీమ్ తో దాదాపు మూడు నెలల పాటు స్క్రిప్ట్ పై వర్క్ చేశాడు.సాదారణంగా అయితే రీమేక్ స్క్రిప్ట్ పై ఇంత వర్క్ అవసరం ఉండదు.
కాని కథ మెయిన్ లైన్‌ను అలాగే ఉంచి మొత్తం స్క్రీన్ ప్లేను మార్చాలి.ఒరిజినల్ వర్షన్లో హీరో పాత్రకు జోడీగా హీరోయిన్ ఉండదు.
అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఉండవు.పైగా ఒరిజినల్ వర్షన్లో చాలా పాత్రలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది.
ఇన్ని మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ ను రెడీ చేయడం అంటే మామూలు విషయం కాదు.

వినాయక్ తాజాగా రెడీ చేసిన స్క్రిప్ట్ తో చిరు చరణ్ ల వద్దకు వెళ్లాడట.వినాయక్ రెడీ చేసిన కథకు చరణ్ ఆసక్తి చూపించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడట.
మరి కొన్నాళ్ల పాటు కథపై వర్క్ చేయాల్సిందే అంటూ వినాయక్ సూచించాడట.ఇప్పటికే సుజీత్ నాలుగు నెలలు, వినాయక్ మూడు నెలలు కూర్చున్నారు.
మరికొంత కాలం కూడా కూర్చుంటారా ఇంతకు లూసీఫర్ తెలుగు రీమేక్ సెట్ అయ్యేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.