పవన్ అభిమానుల ఆవేదనను అర్థం చేసుకుంటారా..?

అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ గా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతోంది.

అయితే పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాల్లో నటించడం ఆయన అభిమానులకు పెద్దగా ఇష్టం లేదు.పవన్ కెరీర్ మొదట్లో రీమేక్ సినిమాల వల్లే బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు.

పవన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ సినిమాకు గబ్బర్ సింగ్ కు పెద్దగా పోలికలుండవు.ఆ సినిమా తరువాత పవన్ నటించిన, ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన అత్తారింటికి దారేది స్ట్రెయిట్ సినిమానే కావడం గమనార్హం.

మరోవైపు యూట్యూబ్, ఓటీటీల ప్రాముఖ్యత పెరిగిన తరువాత యువతలో చాలామంది ఇతర భాషల్లో హిట్టైన సినిమాలను సబ్ టైటిల్స్ వల్ల సులువుగా అర్థం చేసుకుంటూ చూసేస్తున్నారు.దీంతో రీమేక్ సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

Advertisement

ఈ సంవత్సరం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 96ను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేస్తే డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.నిన్న పవన్ కళ్యాణ్ మలయాళం హిట్ సినిమా ‘అయ్యప్పనుం కోషీయుం’ లో నటించనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ ప్రకటనపై పవన్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమాను ఇలా చాలామంది చూసేశారని.

ఈ సినిమా రీమేక్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు ఈ సినిమాకు దర్శకుడిగా సాగర్ చంద్రను ఎంచుకోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు.

సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు.దీంతో సాగర్ చంద్రతో సినిమా అంటే రిస్క్ అని పవన్ ఫ్యాన్స్ భావిస్తూ ఉండటం గమనార్హం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు