ఉన‌కోటి ప్రాంతం గురించి విన్నారా..?! అసలు అక్కడ విశిష్టత ఏంటంటే..?!

మన దేశంలో ఎన్నో చారిత్రిక, పురాతన ప్రదేశాలు చాలానే ఉన్నాయి.అందులో ఎక్కువగా ఆధ్యాత్మిక నిర్మాణాలు ఉండడం గమనిస్తూనే ఉంటాము.

అయితే ఇప్పటికి కూడా మన దేశంలో ఉన్న చాలా ప్రాంతాల పురాణ కథలు తెలుసుకోకుండా వాటిని అలా వదిలేస్తూ ఉంటాము.అలాంటి వాటిలో ఒకటి త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల కు 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం ఉనకోటి .

నిజానికి ఈ ప్రాంతం గురించి మన దేశంలో చాలామందికి తెలియదు.ఈ ప్రాంతం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది అది ఏమిటో ఒకసారి చూద్దామా.

పూర్వం ఈ ప్రాంతంలో ఒక కోటి మంది దేవతమూర్తులు విశ్రాంతి తీసుకునేందుకు వచ్చారని.అయితే, ఆ సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై వారందరినీ తెల్లవారు జాము అయ్యేసరికి అక్కడి నుండి వెళ్లిపోవాలని ఆదేశించాడట.

Advertisement

అయితే దేవతామూర్తులు ఆ విషయాన్ని మర్చిపోయి ఆదమరిచి నిద్రపోగా మరుసటి రోజు ఉదయం దేవతామూర్తులు లేచే సరికి వారిని శిలలుగా మార్చేశాడని అక్కడి వారు చెబుతారు.అందుకే ఆ ప్రాంతానికి ఉనకొటి అని అని పేరు వచ్చిందని స్థానికులు తెలిపారు.

అయితే ఈ సంఘటనకు ఆధారంగానే ఇక్కడ ఎన్నోనో దేవతామూర్తులకు చెందిన భారీ శిల్పాలను అక్కడ చూడవచ్చు.ఆ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతంలో ఏటవాలుగా ఉన్న రాళ్లకు ఎంతో అందంగా చెక్కబడి ఉన్న భారీ శిల్పాలను మనం అక్కడ గమనించవచ్చు.

ఆ ప్రాంతంలో ఎంతో పెద్ద భారీ శిల్పాలు, అలాగే కొన్ని కళాకృతులు మనకు దర్శనమిస్తాయి.అంతేకాదు ఆ ప్రాంతం అంతా ఎంతో చూడ చక్కని పర్వతాలు, అలాగే పచ్చని అడవి ప్రాంతంతో చూడడానికి ఎంతో రమణీయంగా ఉంటుంది.

ఇక్కడ మనం ఆరాధించే వినాయకుడు, శివుడు, నంది, విష్ణు, హనుమాన్, నరసింహ ఇలా పలు దేవుళ్ళ విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు.ఒకానొక సమయంలో ఆ ప్రాంతం బౌద్ధుల ప్రధాన కేంద్రంగా కూడా పేరుపొందింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అయితే ఇప్పుడు దీన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.ఇలాంటి ప్రదేశం ఒకటి మన దేశంలో ఉందని కూడా తెలియకపోవడం నిజంగా విచారకరమైన విషయమే.

Advertisement

నిజానికి ఈ ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాలలో చోటు ఉండాల్సిందే.కాకపోతే దీన్ని అలాగే గాలికి వదిలేశారు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాంతంలో అక్కడ ఉన్న విగ్రహాల కోసం అన్వేషణ ప్రారంభించింది.వాటిని అక్కడ సేకరించి భద్రపరచాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆలోచిస్తోంది.

తాజా వార్తలు