శెభాష్‌ : అందరి మనసులు గెలుచుకున్న అవినాష్‌

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ఏడవ వారం ముగింపు దశకు వచ్చింది.ప్రతి వారం మాదిరిగానే ఈ వారం ఒక టాస్క్‌ ఇచ్చారు.

ఈ టాస్క్‌ లో బెస్ట్‌ గా నిలిచిన అవినాష్‌ మరియు అరియానాలకు కెప్టెన్సీ టాస్క్‌ ను ఇచ్చారు.వీరిద్దరు మొదటి నుండి కూడా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.

కెప్టెన్‌గా వీరిద్దరు నేను అంటే నేను అంటూ పోటీ పడుతున్నారు.టాస్క్‌ కు ముందు కూడా వీరు నువ్వు అయితే ఇలా నేను అయితే అలా అంటూ కొన్ని కండీషన్స్‌ పెట్టుకున్నారు.

ఇక టాస్క్‌ సమయం రానే వచ్చింది.ఇంటి సభ్యులను ఒప్పించి తమ జంక్షన్‌ లో ఎక్కించుకుని ట్రాలీలో దించుకునే టాస్క్‌ అది.ఆ టాస్క్‌లో కొందరు అరియానాకు మరి కొందరు అవినాష్‌కు సపోర్ట్‌ చేశారు.దివి మరియు హారికలు అరియానాకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పారు.

Advertisement

ఇప్పటి వరకు లాస్య తప్ప మరెవ్వరు అమ్మాయి కెప్టెన్‌ అవ్వలేదు.అందుకే ఆ బాధ్యత ఈసారికి అరియానాకు ఇస్తామంటూ చెప్పడం జరిగింది.

వారిద్దరితో పాటు మెహబూబ్‌ మరియు నోయల్‌లు కూడా అరియానాకు మద్దతు తెలిపారు.మిగిలిన ఆరుగురు అవినాష్‌కు సపోర్ట్‌గా నిలిచారు.

దాంతో అరియానా కంటే అవినాష్‌కు ఎక్కువ మంది ఉండటంతో ఈ టాస్క్‌లో విజేతగా అవినాష్ గెలిచి కెప్టెన్‌ అయ్యాడు.కెప్టెన్‌ అయిన ప్రతి ఒక్కరు ఆ తర్వాత రేషన్‌ మేనేజర్‌ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.

అవినాష్‌ ఆ విషయంలో అందరి మనసులు గెలుచుకున్నాడు.ఇంటి కెప్టెన్‌ గా అమ్మాయిలు అవ్వడం లేదని హారిక మరియు దివిలు అంటున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అందుకే నా ఫ్రెండ్‌ అయిన అరియానాకు ఈసారికి రేషన్ మేనేజర్‌ బాధ్యతలు అప్పగిస్తాను అంటూ పేర్కొన్నాడు.దాంతో అంతా కూడా అభినందించారు.

Advertisement

కెప్టెన్సీ రాకున్నా ఈ బాధ్యత అయినా వచ్చినందుకు అరియానా సంతోషంగా ఉన్నట్లుగా అనిపించింది.ఇక రేషన్‌ మేనేజర్‌ అయిన అరియానాను స్టోర్‌ లోకి పిలిచి అభిజిత్‌ బట్టలు మరియు ఇంటి కోసం సరుకులు ఉన్నాయి.

ఒకదాన్ని ఎంపిక చేసుకోండి అంటూ తెలియజేశారు.అప్పుడు మొదట అభిజిత్‌ బట్టలు అనుకుంది.

కాని ఆ తర్వాత వారం రోజులు ఇంటి సభ్యులు అంతా తిండి లేకుండా ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యంతో మళ్లీ మనసు మార్చుకుని రేషన్‌ కావాలని చెప్పింది.ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో అమ్మ రాజశేఖర్‌ మరియు నోయల్‌ల మద్య గొడవ జరిగింది.

నోయల్‌ను యాక్టింగ్‌ చేస్తున్నవాంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశాడు.కెప్టెన్‌ అయిన అవినాష్‌ కొత్త కండీషన్స్‌ పెట్టి ఇంటి సభ్యులను ముందస్తుగానే హెచ్చరించాడు.

తాజా వార్తలు