మృతి చెందిన ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్

ప్రొఫెసర్‌ డీనోగా పేరుగాంచిన విక్టోరియా బ్యాట్స్‌మన్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్‌ హఠాన్మరణం చెందారు.

ప్రస్తుతం ముంబై లో ఉంటున్న ఆయన గురువారం ఉన్నట్టుండి గుండె పోటు రావడం తో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్‌గా జోన్స్‌ 1984-1992 లో ఆడారు, టెస్టులో 3,631 పరుగులు చేసిన జోన్స్‌ వాటిలో 11 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు ఉ‍న్నాయి.ఎటాకింగ్‌ బ్యాటింగ్‌ స్టైల్‌తో అలరించిన జోన్స్ 245 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 19,188 రన్స్‌ సాధించడం విశేషం.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ తరఫున వ్యాఖ్యానం చేసేందుకు ఆయన భారత్‌కు వచ్చారు.ముంబైలోని ఓ హోటల్‌లో గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చింది.దీనితో ఆయనను ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించగా దారిలోనే ఆయన కన్నుమూసినట్లు తెలుస్తుంది.1984 నుంచి 1992 మధ్య ఎనిమిదేండ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు.తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఆసీస్‌ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలు ఆడాడు.టెస్టుల్లో 46.11 సగటుతో 3,631 పరుగులు సాధించాడు.వన్డేల్లో 44.61 సగటుతో 6,068 రన్స్‌ చేశాడు.పరిమిత ఓవర్ల క్రికెట్లో 7 శతకాలు, 46 హాఫ్‌సెంచరీలు సాధించి మంచి క్రికెటర్ గా నిలిచాడు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు