గుర్తుపట్టారా? పట్టె ఉంటారు లెండి! ఎందుకంటే అక్కడ ఉన్నది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కదా! ఎవరైనా సరే టక్కున గుర్తుపడతారు. సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో అచ్చుగుద్దినట్టు ఉండే ఎన్టీఆర్ చిన్నప్పటి ఫోటో అది.
మన టాలీవుడ్ హీరోలలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికి సొంతంగా పైకి వచ్చిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్టీఆర్ ఏ.
అందరూ అంటుంటారు.తాతపోలికలు ఉండటం వల్ల .సీనియర్ ఎన్టీఆర్ మనవడు కావడం వల్ల, హరి కృష్ణ తండ్రి కావడం వల్ల ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరో అయ్యాడు అని.కానీ నిజానికి అలా ఏమాత్రం కాదు.అతను పుట్టింది స్టార్స్ ఇంట్లో అయినప్పటికి అతను సినిమాల్లో ఎవరి సహాయం లేకుండా సొంతంగా సినిమాల్లో ఉండేందుకు ఎంతో ప్రయత్నించాడు.
కెరీర్ ప్రారంభంలో సొంతవారే అతన్ని తొక్కేయాలని చూసిన ఎంతో శ్రమించి.ఎంతో కష్టపడి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.మాస్ సినిమాల్లో నటించి మాస్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచాడు.రాజమౌళి దర్శకత్వంతో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతోనే బాగా దగ్గరయ్యాడు.
ఆతర్వాత ఆది, సింహాద్రి, యమదొంగ అంటూ సినిమాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు.ఎన్టీఆర్ అంటే చాలు వావ్ అనే రేంజ్ లో సినిమాలు తీశాడు.
డ్యాన్స్ హీరోగా పేరు పొందాడు.అధిక బరువును తగ్గించుకొని టాలీవుడ్ స్టార్ హీరోలా మెరిసిపోతున్నాడు.
ప్రస్తుతం జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి మల్టి స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) సినిమాలో నటిస్తున్నాడు.ఈ మల్టీస్టారర్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.