అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, మరింత అందంగా కనిపించాలని ఎన్నో సోయగాలు చేస్తూ ఉంటారు.తల నుండి మొదలుకొని మొహానికి, కాళ్లు, చేతులు వరకు అందంగా కనిపించాలని తెగ ప్రయత్నిస్తుంటారు.
అమ్మాయిల చేతి వేలు ఎంత అందంగా ఉన్నా వాటికి నెయిల్ పాలిష్ పెడితే ఆ లుక్కే వేరు.అయితే నెయిల్ పాలిష్ ను వాడకూడదు.
అందులో ఎక్కువ రసాయనాలు కలిగి ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతూ ఉంటారు.
అలాంటప్పుడు కుడిచేతికి కాకపోయినా ఎడమ చేతికి పెట్టుకొని అయినా మురిసిపోతూ ఉంటారు.
మరి అంతగా ఇష్టపడే నెయిల్ పాలిష్ లను మన ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది.మరి ఈ నెయిల్ పాలిష్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
నెయిల్ పాలిష్ తయారు చేసుకోవడానికి హెన్నా లేదా మెహందీ పౌడర్ ను రెండు టీ స్ఫూన్లు తీసుకోవాలి.లవంగాలు, బెల్లం కూడా అవసరమవుతుంది.
ముందుగా బెల్లం మొత్తం పౌడర్ గా తయారు చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి.బెల్లం పౌడర్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి అందులో లవంగాలు పెట్టాలి.
ఈ గిన్నె పైన మరొక గిన్నె బోర్లించి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి
వేడి పెరుగుతున్న కొద్దీ బెల్లం కరుగుతుంది.ఇలా బెల్లం మొత్తం కరిగి ఆవిరి రూపంలో బయటకు వస్తుంది.
బెల్లం మొత్తం ఆవిరి రూపంలో కరిగిపోయిన తర్వాత ఇందులో హెన్నా పౌడర్ ని ఉండలు లేకుండా బాగా కలపాలి.ఈ మిశ్రమం చల్లారిన తర్వాత కాటన్ బాల్స్ సహాయంతో నెయిల్ పాలిష్ లాగా మన గోర్లకు వేసుకోవచ్చు.
ఈ నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు వరకు ఉంటుంది.దీనిలో ఎలాంటి రసాయనాలు లేవు కాబట్టి ఎటువంటి చర్మ సమస్యలు లేదా అలర్జీలు రావు.
చూశారు కదా ఇంట్లోనే సహజసిద్ధంగా నెయిల్ పాలిష్ ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది.మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి.