అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్ష అభ్యర్ధిగా భారత సంతతి మహిళ కమలా హారీస్ పోటీ చేస్తున్న విషయం విధితమే.
అటు ఆఫ్రో అమెరికన్, ఇండో అమెరికన్ సంతతికి చెందిన మహిళ కావడంతో ఆమెని ఉపాధ్యక్ష పదవికి బిడెన్ ఎంపిక చేశారు.ఎంతో చురుకైన మాటలతో, ప్రత్యర్దులకి కౌంటర్ ఇస్తూ దూసుకుపోయే ప్రతిభాశాలి అయిన కమలా హారీస్ ఏంచేసినా సంచలనమే.
భారతీయ ఓటర్లని ఆకట్టుకోవడానికి ఆమె భారత్ లో తన తల్లి సొంత గ్రామంలో పూజలు చేయించడం, కొబ్బరికాయలు కొట్టించడం చేయడమే కాకుండా తమిళంలో కొన్ని పదాలను పలుకుతూ, నాకు ఇడ్లీ అంటే ఎంతో ఇష్టమని చెప్తూ భారతీయ ఓటర్ల ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలాఉంటే తాజాగా
కమలా హారీస్ తన వేష ధారణతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా అమెరికన్స్ కోసం ఈ తరహా సరికొత్త వేషధారణ చేశారని తెలుస్తోంది.ఆమె ధరించిన బట్టలు, షూస్, నీలి రంగు బ్లేజర్ అన్ని ఆమె వ్యక్తిత్వాని ప్రతిభింభించేలా ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు.
కమలా ఓ కార్యక్రమానికి బ్లాక్ టాప్, నీలి రంగు బ్లేజర్, స్నీకర్స్ ధరించి హాజరయ్యారు.ముఖ్యంగా ఆమె ధరించిన స్నీకర్స్ అమెరికా సాంప్రదాయ బూట్లు కావడం విశేషం.
“చక్ టేలర్” అనే షూస్ సుమారు ఏడు దశాభ్దాల నుంచీ సాంప్రదాయంగా ఉంటున్నాయి.అమెరికన్స్ వీటిని ధరించడమే కాదు ఎంతో అభిమానాన్ని కూడా వీటిపై చూపిస్తారు.దాంతో ఇప్పుడు కమలా హారీస్ ఫోటోలు నేట్టింట్లో వైరల్ అవుతున్నాయి .కమల హారీస్ ఎంతో సింపుల్ గా ఉన్నారని, వీటిని ధరించి మమ్మల్ని సంతోషపెట్టారనిఅమెరికన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడు కూడా చక్ టేలర్ ధరించి ఇలా కనిపించిన సందర్భాలు లేకపోవడంతో అమెరికన్స్ ని కమలా ఆకట్టుకుందనే చెప్పాలి.