రాష్ట్రంలో ఎదగాలని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీకి రాజకీయంగా ఎలాంటి అంశాలూ లభించడం లేదా? ఓటు బ్యాంకును పెంచుకునే విషయంలోనూ, యువతను సమీకరించే విషయంలోనూ దృష్టిపెడతామని పదే పదే చెప్పిన రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు.ఆ లైన్‌ను అప్పుడే వదిలేశారా ? ఓటు బ్యాంకుపై కాకుండా.కేవలం ప్రభుత్వంలో ఉన్న పార్టీని టార్గెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా ? అంటే.ఔననే అంటున్నారు పరిశీలకులు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని అంతర్వేది ఆలయంలో రథం కాలిపోయిన ఘటనను సోము రాజకీయం చేశారు.
వాస్తవానికి ఇలాంటి సున్నితమైన విషయాలు.
పైగా రాజకీయంగా ఇవి ఏమేరకు కలిసివస్తాయి ? ఓటు బ్యాంకును సమీకరించుకునేందుకు ఇది పనికివస్తుందా? అనే విషయాన్ని సోము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.కానీ, ఆయన దూకుడుగానే ఈవిషయాన్ని రాజకీయం చేశారు.
వాస్తవానికి ఆయన పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు.అందరినీ కలుపుకొని పోతానని చెప్పారు.
అదే సమయంలో పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును పెంచుకునేందుకు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటానని అన్నారు.కానీ, ఆ దిశగా ఆయన వేసిన అడుగులు ఎక్కడా కనిపించడం లేదు.
ఆయన వేస్తోన్నవన్నీ తప్పటడుగుల్లాగానే ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది.

పైగా రాష్ట్ర పార్టీ అధినేతగా సోము.మిగిలిన వారిని కలుపుకొని వెళ్లడంలోనూ విఫలమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.ఎక్కడికక్కడ పార్టీ బలహీన పడుతున్న పరిస్థితిలో పగ్గాలు చేపట్టిన సోము.అంతర్వేది విషయాన్ని ఈ రేంజ్‌లో రాజకీయంగా మలచాలని భావించడంపై పార్టీలోనే పురందేశ్వరి, జీవీఎల్ వంటి సీనియర్లు కూడా హర్షించలేక పోతున్నారు.“కొన్నింటికి దూరంగానే ఉండాలి“ అంటూ ఈ ఘటనపై సీనియర్ బీజేపీ నాయకుడు ఒకరుపరోక్షంగా వ్యాఖ్యానించారు.
ఇలాంటివన్నీ.పార్టీకి ఎందుకు .ఆర్ ఎస్ ఎస్ చూసుకుంటుందనే కోణంలో ఆయన చెప్పుకొచ్చారు.అంటే.
రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడం అంటే.మతాలను, కులాలను పట్టుకుని వేలాడడం కాదనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలనేది ఆయన ఉద్దేశం.
అంతర్వేదిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో.అంతవరకు ఉపయోగించుకుని ఉంటే బాగుండేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
కానీ, సోము మాత్రం తాను పట్టిన కుందేలుకి మూడు కాళ్లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.