గత కొంతకాలంగా జనసేనను జనాల్లోకి తీసుకువెళ్లే విషయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సక్సెస్ గట్టి ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తున్నారు.ఎన్నికలకు ఇంకా సమయం ఎంతో లేకపోవడంతో, ముందు నుంచి తమ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునే విషయంపై పవన్ దృష్టి సారించారు.
అందుకే పెద్దగా హడావుడి లేకుండానే ప్రజలకు దగ్గర అయ్యేందుకు, ప్రజల్లో జనసేనపై క్రేజ్ పెరిగేలా చేసుకునేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే రైతు భరోసా యాత్ర పేరుతో గత కొంతకాలంగా జిల్లాల వారీగా పవన్ పర్యటనలు చేస్తున్నారు.
ఒకవైపు కౌలు రైతులకు సాయం అందిస్తూనే పూర్తిగా వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ పవన్ విమర్శలు చేస్తున్నారు.
అయితే ఈ రైతు భరోసా యాత్రకు పవన్ గత కొంతకాలంగా బ్రేక్ ఇచ్చారు.
అయితే ఇప్పుడు పవన్ మరోసారి కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు కడప జిల్లాలో పర్యటించేందుకు ఏర్పాటు చేసుకున్నారు .కడపలో పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ విమర్శలు చేస్తున్నారు.ఈనెల 20వ తేదీన పవన్ ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు.ఈ మేరకు తగిన ఆర్థిక సహాయం అందించమన్నారు.
అయితే రాయలసీమ ప్రాంతంలో జనసేనకు అంతగా పట్టు లేకపోయినా, జగన్ ను టార్గెట్ చేసుకుంటూ పవన్ రాయలసీమలోను జనసేన ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కాకపోతే పూర్తిగా జగన్ ప్రభావం ఉండే కడప జిల్లాలో పవన్ పర్యటన ఏ విధంగా సాగుతుందనే టెన్షన్ కూడా జనసేనలో ఏర్పడింది.కడప శివారులో సిద్ధవటం లో పవన్ సభను నిర్వహించబోతున్నారు.ఈ సిద్ధవటం రాజంపేట నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
ఇక పవన్ పర్యటన మొత్తం జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లే విధంగా కనిపిస్తోంది.కేవలం రైతులకు సాయం అందించి పరామర్శించడమే కాకుండా, ఏపీ వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కడప జిల్లా జగన్ సొంత ప్రాంతం అని చెప్పుకుంటున్నా, ఇక్కడ ఆ స్థాయిలో అభివృద్ధి లేదని పవన్ తన ప్రసంగాలలో విమర్శలు చేయడమే కాకుండా వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోతున్న తీరును పవన్ తన ప్రసంగాల ద్వారా హైలెట్ చేసే అవకాశం కనిపిస్తోంది.







