సాధరణంగా అసెంబ్లీ సమావేశాలలో ఏదైన గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సర్వసాధారణం.కానీ సభలో లేని ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీని సస్పెండ్ చేయడం ఏప్పుడైన చూశారా?.ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఘటన జరిగింది.అసెంబ్లీ సమావేశాల రెండోరోజు శుక్రవారం పెరిగిన ధరలపై చర్చంచాలని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వాయిదా తీర్మానం ఇచ్చారు.
ధరల పెరుగుదలపై వెంటనే చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో టీడీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు.దీంతో వారిని సస్పెండ్ చేయాలంటూ చీఫ్ విప్ ప్రసాదరాజు తీర్మానం ప్రవేశపెట్టారు.
తీర్మానం మేరకు స్పీకర్ 14 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
వారిలో అచ్చెన్నాయుడు, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డి భవాని, నందమూరి బాలకృష్ణ, గద్దె రామ్మోహన్, బెందాళం అశోక్, బుచ్చయ్య చౌదరి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, మంతెన రామరాజులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.తర్వాత సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేల జాబితాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియాకు విడుదల చేశారు.

విచిత్రంగా నందమూరి బాలకృష్ణ పేరును కూడా అందులో చేర్చారు.బాలకృష్ణ ప్రస్తుతం.ఏపీ అసెంబ్లీలోనే కాదు భారతదేశంలో కూడా లేరు.టర్కీలో తన చిత్రం NBK107 షూటింగ్‌లో బాలకృష్ణ బిజీగా ఉన్నారు.అయితే ఇది అధికారుల తప్పిదం జరిగినట్లు తెలుస్తుంది.సభలో లేని నందమూరి బాలకృష్ణ పేరును లిస్ట్‌లో చేర్చి దాన్ని స్పీకర్ కు ఇవ్వడంతో ఆయన అలానే చదివేశారు.
ఆ తర్వాత స్సీకర్ తమ్మినేని సీతారాం సభలో బాలకృష్ణ లేరని తెలుసుకుని ఆ పేరును తొలగించారు.నందమూరి బాలకృష్ణ పేరు మాత్రం కాకుండా సభలో లేని గద్దె రామ్మోహన్ పేరును ప్రస్తావించారు.
ఇక సభలో ఎవరు ఉన్నారో కూడా గుర్తించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందంటూ టీడీపీ సభ్యులు ఎద్దేవా చేసింది.







