మన దేశంలో ప్రజలు ప్రతి పండగ సంబరాల ను అంగ రంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు.ఇక పండగ పూట యువత సంబరాలు ఎవరికి అంతుపట్టలేనంతగా ఉంటాయి.
హోలీ పండగ సందర్భంగా యువత సంబరాలతో హోరెత్తిపోతారు.ఇంకా వినాయక చవితి పండగకు మెరిసే లైట్లు పెట్టి డీజే తో చిందులు వేస్తూ ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలను చేస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా గణేశుని ఉత్సవాలను జరుపుకుంటారు.ఏ వేడుక సంబరాలు అయినా మన వల్ల ఎవరికి అనర్ధాలు జరగనంత వరకు బాగానే ఉంటుంది.
సృతి మించిపోతే మాత్రం అనర్ధాలు తప్పవు.మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో గణేషుని ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన ప్లాషింగ్ లేజర్ లైట్ల వల్ల 65 మంది యువత చూపు కోల్పోయారని వైద్యులు తెలిపారు.
హైఇంటెన్సిటీ ఉన్న లేజర్ లైట్లు వెలుతురు వారి కళ్ళల్లో పడుతున్న గంటల తరబడి గణేశుని ముందు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం వల్ల హైపోగ్లైసేమియా హార్మోన్లలో మార్పులు వచ్చాయని దాని వలన చాలామంది యువత తమ కళ్ళను కోల్పోయారని డాక్టర్లు తెలియజేశారు.
వీరిలో కొంతమందికి శస్త్ర చికిత్స చేస్తే కంటి చూపు మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్పారు.
కానీ ఈ శస్త్ర చికిత్సకు చాలా డబ్బు ఖర్చు అవుతుందని కూడా వైద్యులు వెల్లడించారు.కాబట్టి ఒక పండుగ వేడుకైనా, ఒక పెండ్లి వేడుకైనా మనం అక్కడ చేసే సంబరాలు ఎవరికి హాని కలిగించకుండా ఉండాలి.
మన శుభకార్యంలో ఎవరికి ఏ హాని జరగకుండా ఉంటే అదే పది వేలు అని అంటారు కొంతమంది పెద్దలు.అప్పుడే ఆ సంబరాలు ఇంకా సంతోషాన్ని ఇస్తాయి.







