ఫైలెట్ గా మారుతున్న టెంపర్ నటి

తారక్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన టెంపర్ సినిమాలో అత్యాచారానికి గురైన అమ్మాయి పాత్రలో కనిపించిన నటి పేరు అపూర్వా శ్రీనివాసన్.ఈ సినిమాకి ముందుగా ఆమె జ్యోతిలక్ష్మి సినిమాలో కూడా సందడి చేసింది.

అలాగే మరికొన్ని సినిమాలలో కూడా సహాయ నటిగా రాణించింది.మోడల్ గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్న అపూర్వా శ్రీనివాసన్ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.

తానూ త్వరలో ఫైలెట్ అవ్వబోతున్నానని ఆ పెట్టిన ఫోటోలు, పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది.పైలెట్ ట్రైనింగ్ తీసుకొని లైసెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

తను పైలెట్ గా యూనిఫాంలో ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేసింది.దుండిగల్ ఎయిర్ బేస్ నుండి హైదరాబాద్ స్కైస్ లో షికార్లు చేసినట్లు చెప్పింది.

Advertisement

విటి.ఎఫ్.ఏ.వి సెస్నా విమానంలో తన మొదటి సోలో రైడ్ చేసినట్లు తెలియజేసింది.కమర్షియల్ పైలట్ గా ఎదగడానికి అపూర్వ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.

దీని కోసం ముందు పైలెట్ లైసెన్స్ పొందే అర్హత సాధించడానికి ఆమె చాలా లైసెన్స్ లను పొందాలి.పైగా పర్ఫెక్ట్ ఫిట్ గా ఉండాలి.ఇకవేళ ఆమె ఫైలెట్ గా లైసెన్స్ పొందితే ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన మొదటి అమ్మాయిగా అపూర్వ నిలిచిపోతుంది.

మొత్తానికి తనని నటిగానే చూసిన ప్రేక్షకులకి అపూర్వా ఈ విధంగా స్వీట్ షాక్ ఇచ్చింది.కొద్ది రోజుల క్రితం మోడలింగ్ రంగంలో రాణిస్తున్న అమ్మాయి సివిల్స్ ర్యాంకు సొంతం చేసుకుంది.

ఇప్పుడు అపూర్వా మోడలింగ్ నుంచి ఫైలెట్ గా మారబోతుంది.మొత్తానికి అందాల భామలు తమకి నచ్చిన మోడలింగ్ చేస్తూ, తమ కెరియర్ లక్ష్యంగా ఇలాంటి సాహసాలు చేయడం నిజంగా శుభపరిణామం.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు