తమిళనాడులో మళ్ళీ రచ్చకెక్కిన హిందీ గొడవ

తమిళనాడులో భాషాభిమానం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

వారి భాష, జాతి కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి సైతం అక్కడి ప్రజలు సిద్ధంగా ఉంటారు.

అలాగే తమిళనాడులలో ఎక్కడ చూసిన ప్రాంతీయ భాష ఎక్కువగా వినిపిస్తుంది.ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలలో కూడా తమిళం అధికార భాషగా ఉంటుంది.

ముఖ్యంగా నార్త్ ఇండియా, హిందీ బాష ఆధిపత్యాన్ని వారు మొదటి నుంచి సహించడం లేదు.హిందీ భాష విషయంలో ఎప్పుడు తమిళులు గొడవ పడుతూ ఉంటారు.

తమిళ ప్రజల ఆత్మాభిమానం రెచ్చగొట్టాలంటే హిందీ అంశాన్ని అక్కడి రాజకీయ పార్టీలు కూడా తెరపైకి తీసుకొని వస్తాయి.కొద్ది రోజుల క్రితం డిఎంకె పార్టీ మహిళ నేత కనిమొళి హిందీ విషయంలో పెద్ద రాద్ధాంతం చేసింది.

Advertisement

ఆ వివాదం సద్దుమణగక ముందే మరోసారి హిందీ వ్యతిరేక జ్వాల ఎగిసింది.కర్ణాటకకు విడుదల చేసిన నీటి పరిమాణంపై వివరణ కోరుతూ తమిళనాడుకు చెందిన కావేరీ కమిటీ కేంద్ర జల సంఘాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా కోరింది.

అయితే కేంద్ర జల సంఘం హిందీలో తన జవాబు పంపింది.దాంతో కావేరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమిళనాడులో హిందీ అధికార భాష కాదని, వాడుక భాష కూడా కాదని కావేరీ కమిటీ సమన్వయకర్త, తమిళ నేషనలిస్ట్ పార్టీ నేత మణియరసన్ మండిపడ్డారు.తమిళనాడులో తమిళం, ఇంగ్లీషు మాత్రమే అధికారికంగా చలామణీ అవుతున్నాయని, అలాంటప్పుడు హిందీలో ప్రత్యుత్తరం ఎలా పంపిస్తారంటూ కేంద్ర జల సంఘాన్ని ప్రశ్నించారు.

ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులకు పూర్తి వ్యతిరేకం అని, తెలియని భాషలో సమాధానం ఇవ్వడం సరికాదని అన్నారు.దీనికి ఇతర సామాజిక కార్యకర్తలు, పార్టీల నుంచి కూడా మద్దతు వచ్చింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

కావాలనే కేంద్ర ప్రభుత్వం తమిళుల సహనాన్ని పరీక్షిస్తున్నారని, పదే పదే అవమానిస్తున్నారని ఈ విషయాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు